వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా అలాగే ‘కింగ్’ అక్కినేని నాగార్జున మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. ‘సత్యం’ ‘గౌరి’ ‘గోదావరి’ ‘మధుమాసం’ ‘పౌరుడు’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘మళ్ళీరావా’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. ఇంకా పలు యావరేజ్ సినిమాల్లో కూడా నటించాడు. అయినప్పటికీ ఇతను స్టార్ హీరో అవ్వడం అనే విషయాన్ని పక్కన పెడితే…హీరోగా నిలదొక్కుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నాడు. అతనికంటే వెనుక వచ్చిన నాని, విజయ్ దేవరకొండ,అడివి శేష్,విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలు దూసుకుపోతుంటే సుమంత్ మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాడు. దానికి ప్రధాన కారణం ఏంటనేది ఇప్పటివరకూ ఎవ్వరూ అంచనా వెయ్యలేకపోతున్నారు.

పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఆకట్టుకునే గ్లామర్, నటన కలిగిన యాక్టర్ అయినప్పటికీ.. ఇంకా అతను వెనుకపడే ఉన్నాడు.అయితే సుమంత్ చాలా సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చెయ్యడం వలనే స్టార్ అవ్వలేకపోయాడని కొందరు చెబుతున్న మాట. తన 20 ఏళ్ళ సినీ కెరీర్లో సుమంత్ చాలా సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు సుమంత్. ఒకవేళ ఆ సినిమాలు చేసుంటే.. కచ్చితంగా సుమంత్ రేంజ్ ఇప్పుడు మరోలా ఉండేదేమో. సరే ఇంతకీ సుమంత్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1)నువ్వేకావాలి

2)తొలిప్రేమ

3)నువ్వువస్తావని

4)మనసంతా నువ్వే

5)ఆనందం

6)ఇడియట్

7)దేశముదురు

8) గమ్యం

9)అష్టా- చమ్మా

10)నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్

ఇదండీ.. ఒక్క ‘నా ఆటోగ్రాఫ్’ సినిమాని పక్కన పెట్టేస్తే.. సుమంత్ మిస్ చేసుకున్నవన్నీ సూపర్ హిట్ సినిమాలే. ఇవి కనుక ఇతను చేసుంటే.. కచ్చితంగా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగేవాడేమో. సరే ‘కపటదారి’ సినిమాతో అయినా సుమంత్ కెరీర్ టర్న్ అవుతుందేమో చూద్దాం..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus