Allu Arjun: ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు చికెన్ ముట్టని బన్నీ?

  • June 5, 2023 / 12:29 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ గూని ఉన్న వ్యక్తిలా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ అమ్మోరు గెటప్ లో ఎంతో భయంకరంగా ఉన్నారనే చెప్పాలి.ఎన్టీఆర్ ఈ గెటప్ కనుక చూస్తే నటన కోసం ఈయన ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ఇష్టం ఉండడంతో తన సినిమాలలో పాత్రల కోసం 100% న్యాయం చేయడానికి ఏమాత్రం వెనకాడరు.

అయితే గతంలో ఈయన నటించిన ఓ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు చికెన్ దూరం పెట్టారని, చికెన్ ముట్టకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇలా నాన్ వెజ్ తినకుండా అల్లు అర్జున్ నటించిన సినిమా ఏంటి అనే విషయాన్ని వస్తే.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణుడి కుర్రాడి పాత్రలో నటించారు.

బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరు కనుక ఈ పాత్రలో నటించిన (Allu Arjun) అల్లు అర్జున్ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు చికెన్ తన దరికి రానివ్వలేదని తెలుస్తుంది. ఇలా ఈయన బ్రాహ్మణులను గౌరవిస్తూ అలాంటి పాత్రలో నటిస్తున్నందుకు చికెన్ తినకుండా ఉన్నారని ఓ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ చేసినటువంటి ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus