ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప 2సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ సినీ కెరియర్ లో ఇది 22వ సినిమా కావడం విశేషం.
ఇక ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇలా త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిస్క్ చేస్తున్నారని కొందరు భావించగా ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిసి పలువురు (Allu Arjun) అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నారేమోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గర కాలేదు ఈయన కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే సుపరిచితం అంతేకాకుండా త్రివిక్రమ్ సినిమాలలోని డైలాగ్స్ అన్నీ కూడా పలు సినిమాల డైలాగ్స్ తలపిస్తుంటాయన్న వివాదం కూడా త్రివిక్రమ్ పై ఉంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రకటించడంతో పలువురు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుందన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ స్టోరీ అని, సోషల్ ఫాంటసీ మూవీ అని పెద్ద ఎత్తున సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవేవీ కాదని మహాభారతంలోని రెండు పర్వాలను తీసుకొని ఆ స్టోరీకి మోడ్రన్ టచ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే ఈ విషయాల గురించి క్లారిటీ ఇవ్వబోతున్నారు.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!