నభా నటేష్ స్పీడ్ కి బ్రేక్ వేసిన బెల్లంకొండ

“ఇస్మార్ట్ శంకర్” రామ్, పూరి జగన్నాధ్ ల కెరీర్ కి ఎంత ప్లస్ అయ్యిందో తెలియదు కానీ.. ఆ సినిమా ద్వారా నభా నటేష్ పొందిన, సాధించుకున్న క్రేజ్ & స్టార్ డమ్ మాత్రం లెక్కలేనంత. ఆ సినిమా తర్వాత ఇమ్మీడియట్ గా ఒక 8 సినిమాలు సైన్ చేసేసింది పాప. అయితే.. ఆ కంగారులో సైన్ చేసిన “అల్లుడు అదుర్స్” మాత్రం ఆమె కెరీర్ కి పెద్ద మైనస్ గా మారింది.

సినిమా ఫ్లాప్ అయినా ఆమెకు పెద్దగా మైనస్ అయ్యేది కాదు కానీ.. సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ & గ్లామర్ కి మైనస్ మార్క్స్ పడ్డాయి. చాలా సన్నివేశాల్లో నభా ఒరిజినల్ ఏజ్ బయటపడిపోయిందని చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా తాగిపడిపోయిన సన్నివేశంలో ఆమె స్కిన్ టోన్ చూసిన ప్రేక్షకులు కూడా ఇదేంటి ఇలా ఉంది అని అవాక్కవుతున్నారు. కుదిరితే నభా గ్లామర్ పరంగా అయినా జాగ్రత్తలు తీసుకోవాలి లేదా చేసే ప్రోజెక్టుల విషయంలో రెమ్యునరేషన్ కు మాత్రమే కాక కథకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి.

లేదంటే స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన నభా సాధారణ హీరోయిన్ గా మిగిలిపోతుంది. రాబోయే ప్రాజెక్ట్స్ బాగానే ఉన్నప్పటికీ.. ఆమె ఫిజిక్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మాత్రం కెరీర్ కు మాత్రమే కాదు హీరోయిన్ గా ఆమె ప్రాభవానికి కూడా కష్టమే.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus