టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. రాబోతున్న ప్రతి సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. విడుదల అనంతరం కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినాయి కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటాయని చెప్పవచ్చు. అయితే కొందరు రిలీజ్ విషయంలో ఇంకా కాన్ఫిడెంట్ గా లేరని తెలుస్తోంది. ముఖ్యంగా అల్లుడు అదుర్స్ నిర్మాతలు మనసు మార్చుకున్నట్లు సమాచారం. రిలీజ్ విషయంలో వారు మరో నిర్ణయానికి వచ్చారని టాక్.
అందుకు సంబందించిన రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా ఈ నెల 15న విడుదల చేసినున్నట్లు నిన్నటి వరకు జోరుగా ప్రచారాలు జరిగాయి. సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ జనవరి 14పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అదే తేదీన రామ్ రెడ్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అసలే 50% సిట్టింగ్ కెపాసిటీ అక్యుపెన్సీతో కలెక్షన్స్ ఎలా రాబట్టుకోవాలి అనే ఆలోచనతో సతమతమవుతున్నారు కొందరు.
ఇక ఇప్పుడు సడన్ గా బెల్లంకొండ బాబు, రామ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం వలన బయ్యర్లకు ఎంతో కొంత నష్టాన్ని మిగిల్చక తప్పదు. రెండు సినిమాలపై కూడా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. మరి ఈ క్లాష్ లో ఏ హీరో అత్యధిక వసూళ్లను అందుకుంటాడో చూడాలి.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!