తొలి సినిమా పక్కనపెడితే… పద్ధతికి చీరకట్టినట్లు వేషాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అమలా పాల్. పెళ్లి – విడాకులు తర్వాత అమలా పాల్ విధానం పూర్తిగా మారిపోయింది. ఎంచుకుంటున్న సినిమాలు, చేస్తున్న పాత్రలు, సోషల్ మీడియాలో పోస్టులు, ఫొటో షూట్లు… ఇలా అన్నింటా సరికత్త అమలా పాల్‌ను జనాలు చూస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్ల విమర్శలకు తనదైన శైలిలో రిప్లైలు ఇస్తూ ‘అమలతో మామూలుగా ఉండదు’ అని చెబుతోంది.
ఇటీవల అమలా పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఓ పార్టీ ఆమె ఫుల్‌గా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. దీంతో పాటు కొన్ని ఫొటోలు కూడా ఉన్నాయి. మామూలు పోస్టులు వేస్తేనే… గుచ్చి గుచ్చి చూసి ట్రోల్ చేస్తుంటారు మన కుర్రాళ్లు. అంత ఊపున్న వీడియో కావడంతో కామెంట్లు కాస్త పెరిగాయి. ట్రోలింగ్‌లో వేడి కూడా పెరిగింది. దీంతో అమల కూడా వేడి పెంచింది. ఆమె పోస్ట్ చేసిన వీడియో కింద…
కొంతమంది ‘అవి కనిపిస్తున్నాయి’ అనే అర్థం వచ్చేలా ఓ మెసేజ్ చేశాడు. మామూలుగా అయితే నటీమణులు అన్ని మెసేజ్‌లు చూడరు. చూసినవాటికి కౌంటర్ ఇవ్వకుండా వదలరు. అలా అమల కంట ఆ మెసేజ్ పడింది. కోపం వచ్చిందో లేదో తెలియదు కానీ… బయటకు మాత్రం లైట్ తీసుకుంటూ… ‘అవును అవి కనిపిస్తున్నాయి. ఐతే ఏంటంట? మనం 2021లో ఉన్నాం’ అంటూ జవాబిచ్చింది. దీంతో నెటిజన్ల మైండ్ బ్లాక్ అయ్యింది.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?