వైరల్ అవుతున్న అమలా పాల్ రెండో పెళ్లి ఫోటోలు..!

గత కొంతకాలంగా అమలా పాల్… డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్లిచేసుకున్న అమలా పాల్… తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే కెరీర్ కోసమే విడిపోయినట్టు కవర్ చేశారు వీరిద్దరూ. ఇక విజయ్ కూడా గతేడాది ఓ డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో అమలా పాల్ … ‘నేను కూడా కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను.. సన్యాసి లా మాత్రం ఉండిపోను. అది కూడా ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పింది. ఇక ఈ మధ్య కాలంలో సింగర్ బవేందర్ సింగ్ తో అమలా పాల్ డేట్ చేస్తుందని కథనాలు పుట్టుకొచ్చాయి. వీరిద్దరికీ సంబందించిన ఫోటోలు బవేందర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆ వెంటనే డిలీట్ చేసెయ్యడంతో ఈ వార్తలు ఊపందుకుంన్నాయి.

అయితే ఆ వార్తలన్నీ నిజమేనని ప్రూవ్ అయ్యింది. నిజంగానే అమలా పాల్… సింగర్ బవేందర్ సింగ్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. సింపుల్ గా నార్త్ స్టైల్ లో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తుంది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అమలా పాల్ క్రిస్టియన్ కాబట్టి.. ఆ పద్దతిలో కూడా వీరు వివాహం చేసుకునే అవకాశం ఉందనేది మరో టాక్. అయితే అది ఎంత వరకూ నిజమో తెలియాల్సి ఉంది. అయితే ‘ఇంత సీక్రెట్ గా అమల ఎందుకు పెళ్లి చేసుకుంది… ఇది నిజమైన పెళ్లినా..?” అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమైతేనేం.. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus