అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సమంత..!

సాధారణంగా హీరోయిన్లు పెళ్ళైన తర్వాత ఫేడౌట్ అయిపోతారు.. వారికి అవకాశాలు రావు అని చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. అది చాలా వరకూ నిజమైంది కాబట్టి.. ఆ కామెంట్స్ ను చాలా మంది నమ్మేస్తారు. బాలీవుడ్ లో తప్ప… సౌత్ లో హీరోయిన్లకు పెళ్ళైన తర్వాత కూడా అదే క్రేజ్ ను కొనసాగించిన చరిత్ర లేదని బలంగా కామెంట్స్ చేసే వాళ్ళు లేకపోలేదు ..! అయితే మన సమంత మాత్రం ఆ చరిత్రను తిరగ రాస్తూ దూసుకుపోతుంది. నాగ చైతన్య తో పెళ్ళైన తరువాత తన క్రేజ్ ను డబుల్ చేసుకుంది.

ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ రేంజ్ లో సమంత దూసుకుపోతుంది అనేది వందకు వంద శాతం నిజం. తన పాత్రలు సినిమాలో ప్రాముఖ్యత ఉంటే.. కచ్చితంగా ఆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ క్రమంలో ‘రంగస్థలం’ ‘మజిలీ’ ‘ఓ బేబీ’ వంటి వరుస విజయాల్ని అందుకుంది. ఇటీవల వచ్చిన ‘జాను’ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.. కానీ సమంత నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అలాంటి సమంత ఇప్పుడు మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే.. హైదరాబాద్ టైమ్స్ వారు తాజాగా విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్ -2019’ లిస్ట్ లో సమంత మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇందుకు సమంత చాలా ఆనందంగా ఉందట. వివాహం .. కెరీర్ కు అడ్డం కాదు అన్న విషయాన్ని సమంత మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఆ లిస్ట్ లో మరికొంత మంది టాలీవుడ్ హీరోయిన్లు కూడా స్థానం సంపాదించుకున్నారు వారెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

ర్యాంక్ 1) సమంత

ర్యాంక్ 4) అదితి రావు హైదరీ

ర్యాంక్ 5) పూజా హెగ్డే

ర్యాంక్ 7) రకుల్ ప్రీత్ సింగ్

ర్యాంక్ 8) కాజల్ అగర్వాల్

ర్యాంక్ 9) రష్మిక మందన్న

ర్యాంక్ 11) నిధి అగర్వాల్

ర్యాంక్ 12) కియారా అద్వానీ

ర్యాంక్ 14) నభ నటేష్

ర్యాంక్ 15) రాశీ ఖన్నా

ర్యాంక్ 16) ఈషా రెబ్బా

ర్యాంక్ 17) పాయల్ రాజ్ పుత్

ర్యాంక్ 20) కీర్తి సురేష్

ర్యాంక్ 21) అనుపమ పరమేశ్వరన్

ర్యాంక్ 22) తమన్నా భాటియా

ర్యాంక్ 23) సాయి పల్లవి

ర్యాంక్ 25) శ్రీముఖి

ర్యాంక్ 26) ఆధా శర్మ

ర్యాంక్ 28) రెజీనా

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus