Amardeep, Sivaji: శివాజీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన అమర్!

బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కి రాని రేటింగ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమానికి వచ్చిందని చెప్పాలి. అదే విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఎంటర్టైన్ కూడా చేసింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలోని కంటెస్టెంట్ లో వివాదాలలో కూడా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా ఎంతో పాపులర్ అయిన వారిలో శివాజీ అమర్ ఒకరు వీరిద్దరూ హౌస్ లోకి వెళ్ళిన మొదటి నుంచి కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.

ఇక శివాజీ అమర్ ను తొక్కే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. మొత్తానికి టామ్ అండ్ జెర్రీ మాదిరి వీరిద్దరూ హౌస్ లో ఉన్నన్ని రోజులు గొడవ పడిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం గమనార్హం. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి వీరిద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే శివాజీ అమర్ (Amardeep) గురించి మాట్లాడుతూ..దొంగ ఆటలు ఆడినవాడు, రన్నర్ అయ్యాడు, ఇదంతా బిగ్ బాస్ కావాలనే వాడిని హైలైట్ చేసి రన్నర్ అయ్యేలా చేసాడు అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఇలా తన గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలపై అమర్ స్పందించారు. శివాజీ అన్న మాటలు విన్న తర్వాత మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపించింది.

హౌస్ లో ఉన్నన్ని రోజులేమో నువ్వు నాకు నచ్చావురా అన్నారు బయటకు వచ్చాక మాత్రం ఇలా మాట్లాడుతున్నారు తేనె పూసినకత్తి అంటారు కదా అలాంటివారు శివాజీ అంటూ అమర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus