బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని అంపాదించుకున్న అమర్ దీప్ టాప్3 లో ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అమర్ దీప్ కు వోటింగ్ పర్సంటేజ్ పెరుగుతుండగా అమర్ భార్య తేజస్విని వరుసగా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొన్ని విషయాల్లో శివాజీ బిహేవియర్ వల్ల బాధ పడ్డానని తేజస్విని కామెంట్లు చేశారు. శివాజీ ఎందుకలా మాట్లాడతారని అనుకునేదానినని ఆమె చెప్పుకొచ్చారు.
అమర్ దీప్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుండటంతో శివాజీ అలా చేసి ఉండవచ్చని తేజస్విని తెలిపారు. నేను బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన సమయంలో అమర్ కు చాలా విషయాలు చెప్పాలని అనుకున్నానని కానీ హౌస్ కు వెళ్లిన తర్వాత ఆ విషయాలు మరిచిపోయానని తేజస్విని అన్నారు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత అమర్ తప్ప ఎవరూ కనిపించమలేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
అమర్ కు శివాజీ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉందని తేజస్విని అన్నారు. అమర్ కు అనారోగ్య సమస్యలు ఉన్నాయని బిగ్ బాస్ షోకు వెళ్లడానికి ముందే అమర్ కు బ్యాక్ పెయిన్ ఉందని ఆమె చెప్పుకొచ్చారు. హౌస్ లోకి వెళ్లడానికి ఒకరోజు ముందు కూడా అమర్ కు ఫిజియోథెరపీ జరిగిందని తేజస్విని కామెంట్లు చేశారు. నీతోనే డ్యాన్స్ ఫినాలే రోజున అమర్ పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్స్ ను వేయించుకున్నాడని ఆమె తెలిపారు.
అమర్ దీప్ (Amardeep) నొప్పి అనుభవిస్తూనే బిగ్ బాస్ షోకు వెళ్లాడని నొప్పి అనుభవిస్తున్నా తన వెన్ను నొప్పి గురించి అమర్ చెప్పలేదని తేజస్విని అన్నారు. అమర్ కు నొప్పి తగ్గించడానికి క్రీమ్ ను పంపిస్తూనే ఉన్నానని ఆమె తెలిపారు. అమర్ కు కండరాల బలహీనత ఉందని దెబ్బ తగిలితే ఫ్రాక్చర్ అవుతుందని తేజస్విని వెల్లడించారు. ఈ రీజన్స్ వల్లే అమర్ దీప్ మొదట్లో టాస్కులు పెద్దగా ఆడలేదని ఆమె అన్నారు.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!