‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

  • November 29, 2023 / 12:55 PM IST

గత వారం రోజులుగా రవితేజ – గోపీచంద్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు హోల్డ్ లో పడినట్టు ప్రచారం జరుగుతుంది. ‘మైత్రి’ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో ‘డాన్ శీను’ ‘బలుపు’ ‘క్రాక్’ వంటి సినిమాలు వచ్చాయి. అవి సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో వీరి కాంబోలో అనౌన్స్ చేసిన 4వ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది అంటున్నారు. ఎందుకంటే.. కథ ప్రకారం ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అయిపోతుందట. అది రవితేజ మార్కెట్ కి డబుల్ ఉంది అని వినికిడి. అందుకే రవితేజతో కాకుండా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరోతో ఈ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అని మైత్రి సంస్థ భావిస్తుంది. అయితే ఇలా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత హోల్డ్ లో పడిన కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) జె జి ఎం :

‘లైగర్’ తర్వాత విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రెండో సినిమాగా ‘జెజిఎం'(జన గణ మన) ని అనౌన్స్ చేశారు. పూరితో కలిసి ఛార్మీ ఈ సినిమాని నిర్మించాలి. ముంబైలో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ‘లైగర్’ రిజల్ట్ తో హోల్డ్ లో పడింది. ఇక ఉంటుందో లేదో తెలీదు.

2) కొరటాల – అల్లు అర్జున్ :

ఈ కాంబినేషన్లో కూడా మూవీ ఉంటుందని 2021 సమ్మర్లో అనౌన్స్ చేశారు. ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ వారే ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది.

3) ఐకాన్ :

అల్లు అర్జున్ – దిల్ రాజు – వేణు శ్రీరామ్ (వకీల్ సాబ్ దర్శకుడు) కాంబినేషన్లో ఈ ప్రాజెక్టు ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళింది లేదు. కానీ కచ్చితంగా ఉంటుంది అని దిల్ రాజు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.

4) హరిహర వీరమల్లు :

పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో రూపొందాల్సిన సినిమా ఇది. కానీ ఇప్పటివరకు ఒక్క షెడ్యూల్ కూడా పూర్తి కాలేదు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆలస్యమవుతుంది అని నిర్మాత ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

5) అహం బ్రహ్మాస్మి :

మంచు మనోజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి(ఆదికేశవ దర్శకుడు) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల హోల్డ్ లో పడింది అంటున్నారు.

6) విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి :

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు ఈ కాంబోలో మూవీని అనౌన్స్ చేశారు. శ్రీలీల హీరోయిన్ అని కూడా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు.

7) నిఖిల్ – సుధీర్ వర్మ ప్రాజెక్ట్ :

‘స్వామి రారా’ ‘కేశవ’ సినిమాల తర్వాత నిఖిల్ – సుధీర్ వర్మ కాంబోలో ఓ సినిమా మొదలైంది. కానీ ఎందుకో కొంత భాగం చిత్రీకరణ తర్వాత ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది.

8) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ :

తమిళంలో హిట్ అయిన ‘కర్ణన్’ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ అవుతుంది అని ప్రకటించారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు కూడా హోల్డ్ లో పడింది.

9) వెంకటేష్ – తరుణ్ భాస్కర్ :

ఈ కాంబోలో కూడా సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఎందుకో ఇది కూడా హోల్డ్ లో పడింది.

10) ఆర్.టి.జి.ఎం 4 :

ఇంతకు ముందు చెప్పుకున్నట్టు రవితేజ – గోపీచంద్ – మైత్రి కాంబోలో రావాల్సిన మూవీ కూడా హోల్డ్ లో పడింది. ముందుగా 2024 ఫిబ్రవరి నుండి ఈ ప్రాజెక్టు ఉంటుందని టాక్ నడిచింది. కానీ ఆ ఛాన్స్ లేదని కూడా టాక్ నడుస్తుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus