Dhootha Review in Telugu: దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • December 2, 2023 / 09:13 AM IST

Cast & Crew

  • నాగచైతన్య (Hero)
  • పార్వతి తిరువోతు (Heroine)
  • ప్రియ భవాని శంకర్ , ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ , ఆయుష్ అగర్వాల్,తరుణ్ భాస్కర్, చైతన్య గరికపాటి, రోహిణి, పశుపతి, రాజా గౌతమ్ తదితరులు.. (Cast)
  • విక్రమ్‌ కె.కుమార్‌ (Director)
  • శరత్ మరార్ (Producer)
  • ఇషాన్‌ చాబ్రా (Music)
  • మీకోలజ్‌ సైగులు (Cinematography)

అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగిడుతూ చేసిన సరికొత్త ప్రయత్నం “దూత”. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ మీద మంచి అంచనాలున్నాయి. మరి 8 ఎపిసోడ్స్ ఆ స్థాయిలో ఆకట్టుకున్నాయో లేదో చూద్దాం..!!

కథ: సాగర్ వర్మ అవుధూరి (నాగచైతన్య) నేతృత్వంలో ఒక కొత్త న్యూస్ పేపర్ స్టార్ అవుతుంది. ఒక మంచి బృందంతో భారీ స్థాయిలో మొదలైన ఈ న్యూస్ పేపర్ తో ఆకాశానికి నిచ్చెన వేస్తాడు సాగర్. కట్ చేస్తే.. సాగర్ కి ఎక్కడ పడితే అక్కడ కొన్ని పేపర్ కటింగ్స్ దొరుకుతుంటాయి. అందులో ఉన్నది ఉన్నట్లుగా జరుగుతుంటుంది. ప్రతి పేపర్ ముక్కలో తన కుటుంబ సభ్యులకు, తనకు తెలిసినవాళ్ళకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ పేపర్ కటింగ్స్ సాగర్ దగ్గరకి ఎందుకు వస్తుంటాయి? ఈ పేపర్ ముక్కల కథ ఏమిటి? సాగర్ ఈ అంతుచిక్కని ప్రశ్నల సుడిగుండం నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది “దూత” వెబ్ సిరీస్ కథాంశం.

నటీనటుల పనితీరు: నాగచైతన్య గెటప్ మొదలుకొని బాడీ లాంగ్వేజ్ & నటన అన్నిట్లో కొత్తదనం చూపించాడు. నిజానికి నాగచైతన్య ఈ తరహా పాత్రను ఎప్పుడూ చేయలేదు కానీ.. సాగర్ పాత్రలో అతడు ఇమిడిపోయిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. చైతన్య తర్వాత మంచి నటనతో ఆకట్టుకున్న వ్యక్తి పార్వతి. పోలీస్ ఆఫీసర్ గా ఆమె సీరియస్ లుక్స్ తో అలరించింది. ప్రియ భవానీ శంకర్, తరుణ్ భాస్కర్, రాజా గౌతమ్, చైతన్య గరికపాటి, రవీంద్ర విజయ్ లు మెప్పిస్తారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు విక్రమ్ కుమార్ కథనం మొత్తాన్ని పేపర్ ముక్కల ద్వారా నడిపించిన తీరు సిరీస్ కి మెయిన్ ఎస్సెట్. హీరోకి ఎప్పుడు ఏ ముక్క దొరుకుతుంది, అందులో ఏముంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొల్పాడు. అందువల్ల 8 ఎపిసోడ్ల సిరీస్ లో ఒక్క సన్నివేశం కూడా బోర్ కొట్టదు. అలాగే.. సిరీస్ అనేసరికి అనవసరమైన బూతులు, శృంగార సన్నివేశాలు ఇరికించేస్తున్న ఈ తరుణంలో విక్రమ్ కె.కుమార్ సీన్ డిమాండ్ మేరకు మాత్రమే వాటిని చాలా తక్కువగా వినియోగించుకున్న తీరు ఒక ఫిలిమ్ మేకర్ గా అతడి మీద మరింత గౌరవాన్ని పెంచుతాయి.

సిరీస్ మొత్తాన్ని వర్షంలో తెరకెక్కించడం, పేపర్ కటింగ్స్ అన్నిట్నీ కలగలిపి ఒక పేపర్ గా మార్చడం వంటివి అతడి ప్రతిభకు నిదర్శనం. చిక్కుముడులు అన్నిట్నీ చాలా చాకచక్యంగా విప్పిన విధానం, లాజికల్ గా వివరించిన తీరు గమనార్హం. ముఖ్యంగా కథలోని పాత్రలన్నిట్నీ ఒకే తాటికి తీసుకొచ్చిన స్క్రీన్ ప్లేకి ఆడియన్స్ ఆశ్చర్యపోవడం ఖాయం. మికోలాజ్ సినిమాటోగ్రఫీ సిరీస్ కి స్పెషల్ ఎస్సెట్. సిరీస్ మొత్తం వర్షంలోనే జరుగుతుంది.

అందువల్ల.. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా కష్టం. కానీ.. చాలా అద్భుతంగా చేశాడు మికోలాజ్. ముఖ్యంగా నైట్ షాట్స్ & బ్లడ్ షాట్స్ ను అతడు పిక్చరైజ్ చేసిన తీరు అద్భుతం. ఇషాన్ చాబ్రా నేపధ్య సంగీతం సిరీస్ కి మంచి టెన్షన్ యాడ్ చేసింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ఈ సిరీస్ లో చాలా కీలకపాత్ర పోషించాయి. ఎక్కడా కూడా నిర్మాతలు రాజీపడలేదు అని తెలుస్తుంది.

విశ్లేషణ: “దూత” ఒక ఫెంటాస్టిక్ థ్రిల్లర్. 8 ఎపిసోడ్ల పాటు ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ సిరీస్ ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన బెస్ట్ సిరీస్ గా చెప్పుకోవచ్చు. విక్రమ్ కుమార్ దర్శకత్వ ప్రతిభ, చైతన్య నటన, మికోలాజ్ సినిమాటోగ్రఫీ & ఇషాన్ నేపధ్య సంగీతం ఈ సిరీస్ కు మెయిన్ ఎస్సెట్స్.

రేటింగ్: 3/5

Click Here to Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus