అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో డ్రెస్సింగ్ విషయంలో ఐరా ఖాన్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఐరా ఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. జిమ్ ట్రైనర్ అయిన నూపూర్ శిఖారేతో ప్రేమాయణం వల్ల ఐరా ఖాన్ గురించి చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఐరా ఖాన్ తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
ఐరా ఖాన్ అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు అనే సంగతి తెలిసిందే. గడిచిన నాలుగు సంవత్సరాలుగా తాను యాక్టివ్ గా లేనని ఐరా ఖాన్ చెప్పుకొచ్చారు. ఫలితంగా తాను ఏకంగా 20 కేజీల బరువు పెరిగానని ఆమె వెల్లడించారు. బరువు పెరగడం తనకెంతో కష్టంగా ఉందని ఐరా ఖాన్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఐరా ఖాన్ షేర్ చేసిన ఫోటోలలో గతంతో పోలిస్తే లావుగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐరా ఖాన్ ఫోటోల గురించి చర్చ జరుగుతోంది.
సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడంతో తాను జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఐరా ఖాన్ అన్నారు. బరువు తగ్గడం కొరకు తాను ఏకంగా 15 రోజుల పాటు ఉపవాసం చేశానని ఐరా ఖాన్ వెల్లడించారు. తండ్రి వారసత్వం ఉన్నా సినిమాలపై ఐరా ఖాన్ ఆసక్తి చూపలేదు. టాటూ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఐరా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. బాలీవుడ్ లో నెపోటిజం గురించి జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇతర రంగాన్ని ఎంచుకుని సత్తా చాటుకున్నారు.
ఐరా ఖాన్ ప్రేమలో ఉన్న నూపూర్ శిఖారే పలువురు బాలీవుడ్ హీరోలకు సైతం జిమ్ ట్రైనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజున ఐరా ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుల గురించి జోరుగా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఐరాకు భారీస్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!