‘అఖండ’తో (Akhanda) బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్లో అద్భుత విజయాన్ని అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu), ఆ సక్సెస్‌ను సీక్వెల్‌తో కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ‘అఖండ 2’ (Akhanda 2) పేరుతో ఈ సీక్వెల్‌ను పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించడమే కాకుండా, మరో కీలక పాత్రలో హైలెట్ కాబోతున్నారని సమాచారం. ఈ సారి యుఎస్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ యాక్షన్ సీన్లో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) పాత్రను రక్షించేందుకు బాలయ్య యుఎస్‌లోని ఓ స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పుకుంటున్నారు. స్టైలిష్ లుక్‌లో బైక్‌పై బాలయ్య ఎంట్రీ ఇస్తూ ఈ సీన్లో పోరాటం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ‘అఖండ’లో అఘోరా క్యారెక్టర్ మాత్రమే కాకుండా రైతు పాత్రలో కూడా మెరిసిన బాలయ్య పాత్రను ఈసారి కాస్త చేంజ్ చేయనున్నారట.
రెండవ పాత్ర ఇమేజ్‌ని ఈ సారి పూర్తిగా వేరు చేస్తూ, బాలయ్యను స్టైలిష్ లుక్‌లో పరిచయం చేయాలన్నది బోయపాటి ప్లాన్ అని తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కించే ఈ సీన్లో ఇంటెన్సిటీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకునేలా ఉండబోతోందట. ఈ సీక్వెల్లో కూడా ప్రగ్యా జైస్వాల్ తన మొదటి పాత్రలోనే కొనసాగుతుందని సమాచారం. ఇకపోతే, ఈ సారి కథలో మరిన్ని కొత్త ట్విస్ట్‌లు ఉంటాయని బోయపాటి హింట్ ఇచ్చారు.
‘అఖండ’ భారీ సక్సెస్ అయినందున, ‘అఖండ 2’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి కొత్త హైప్ తీసుకువస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యను సరికొత్త అవతార్‌లో చూపిస్తూ, పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లే విధంగా బోయపాటి శ్రీను ప్రణాళిక వేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే, బాలయ్య పాన్ ఇండియా రేంజ్లో మరింతగా ప్రజాదరణ పొందుతారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.