మరో టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?

అతనొక యంగ్ హీరో (Hero). కెరీర్ ప్రారంభంలో చిన్న సినిమాల్లో నటించాడు. కానీ గుర్తింపు రాలేదు. తర్వాత ఓ మంచి లవ్ స్టోరీ చేశాడు. ఆ సినిమా బాగా ఆడింది. చూడడానికి బాగుంటాడు కాబట్టి.. అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత చేసిన 2,3 సినిమాలు కూడా బాగానే ఆడాయి. అయితే ఆ తర్వాత ఇతనికి మాస్ ఇమేజ్ పై మోజు పెరిగింది. మొదటి ప్రయత్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఓ లవ్ స్టోరీ చేశాడు. అది బాగానే ఆడింది.

Hero

కానీ తర్వాత అదే స్టైల్లో చేసిన 3 సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. మొన్నామధ్య ఓ పెద్ద బ్యానర్లో ఓ లవ్ స్టోరీ చేశాడు. దానికి పాజిటివ్ టాక్ వచ్చినా ఆడలేదు. తర్వాత ఓ కొత్త నిర్మాతతో సినిమా మొదలుపెట్టాడు. బడ్జెట్ సమస్యల వల్ల అది ఆగిపోయింది. తర్వాత ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది ఎప్పటికీ ఫినిష్ అవుతుందో తెలీదు. స్ట్రాంగ్ హిట్టు కొడితే తప్ప ఇతను (Hero) ఫామ్లోకి రావడం కష్టంగా మారింది.

మరోపక్క.. కొన్నేళ్ల క్రితం ఇతను ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. తన ఫ్యామిలీ లైఫ్ గురించి మీడియా ముందు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడడు ఈ హీరో. అయితే తాజాగా ఇతని పర్సనల్ లైఫ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అవేంటంటే..ఈ యంగ్ హీరోకి తన భార్యతో మనస్పర్థలు రావడంతో డిప్రెషన్ కి గురయ్యాడట. అంతేకాదు తన భార్యతో విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై ఆ హీరో అధికారికంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి.

సూర్యకాంతం @ 100 స్పెషల్‌: హీరోయిన్‌ అవుదామని వచ్చి.. అంతకుమించిన పేరు గడించి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus