బికినీలో శ్రీదేవి కూతుళ్ళ అల్లరి.. వీడియో వైరల్!

శ్రీదేవి  (Sridevi)  కూతుళ్లు జాన్వీ కపూర్  (Janhvi Kapoor), ఖుషీ కపూర్ బీచ్ వెకేషన్‌లో మస్త్ అల్లరితో సందడి చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సిస్టర్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. బికినీలలో నీలి సముద్రంలో గడిపిన ఈ సిస్టర్ డ్యూయో, ఫేమస్ కర్దాషియన్ సిస్టర్స్ లాంటి విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో కపూర్ సిస్టర్స్ ఎప్పుడు కూడా గ్లామర్ తో హైలెట్ అవుతూనే ఉంటారు. ఇద్దరు కలిశారు అంటే అల్లరి మాములుగా ఉండదని నిరూపిస్తున్నారు.

Janhvi, Khushi

ఇటీవలే జాన్వీ మరియు ఖుషీ ఒక వీడియోలో కిమ్ కర్దాషియన్ యొక్క ప్రసిద్ధ ‘డైమండ్ ఇయర్రింగ్ ఇన్ ది ఓషన్’ సీన్‌ను పునఃసృష్టించారు. వీడియోలో జాన్వీ సముద్రంలో స్విమ్‌వేర్‌లో తడుస్తూ, చెవిపోగు పోయిందని ఏడుపు ముఖం పెడుతూ హాస్యంగా స్పందించింది. మరోవైపు, ఖుషీ కోర్ట్నీ కర్దాషియన్‌ను అనుకరిస్తూ తన బాల్కనీ నుండి “ఏమైంది నీకు?” అంటూ నిర్లిప్తంగా ప్రశ్నించింది.

ఈ వీడియోకు బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా పాజిటివ్‌గా స్పందించారు. మహీప్ కపూర్, షానయా కపూర్, ఆలియా కశ్యప్ వంటి వాళ్లు ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేశారు. అందరి స్పందన చూస్తుంటే, ఈ అల్లరి వీడియో చాలా మందిని ఆకట్టుకుందనే చెప్పవచ్చు. ఇక కెరీర్ విషయానికొస్తే, జాన్వీ ఇటీవ‌ల టాలీవుడ్ చిత్రం ‘దేవ‌ర’  (Devara) తో హిట్ అందుకుని పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ను సంపాదించింది. మరోవైపు, ఖుషీ కపూర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా మారింది.

ఇక జాన్వీ దేవర పార్ట్ 2లో కూడా కనిపించనుంచి. మొదటి భాగంలో ఆమె పాత్ర చాలా తక్కువగా ఉన్నప్పటికీ సెకండ్ పార్ట్ లో మాత్రం ఇంకాస్త ఎక్కువ నిడివితో ఉంటుందట. ఇక మరోవైపు అమ్మడు రామ్ చరణ్ తో (Ram Charan) కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. బుచ్చిబాబు (Buchi Babu Sana)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అలాగే తమిళంలో కూడా ఒక బిగ్ మూవీలో నటించేందుకు జాన్వీ చర్చలు జరుపుతున్నట్లు టాక్.

ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ వంతు.. అనౌన్స్మెంట్ కోసం కూడా పడిగాపులు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus