సినిమాల ఎంపిక విషయంలో ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్ ఖాన్ ఎంత పర్‌ఫెక్షనిస్ట్‌గా ఉంటాడో.. బయట విషయాల్లో కూడా అంతే పర్‌ఫెక్షనిస్ట్‌గా ఉంటాడు. అంతేకాదు చాలా ప్రాక్టికల్‌గా కూడా ఉంటాడు. ఈ విషయం అర్థమయ్యేలా చాలా సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ మాట చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు ఆమిర్. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
తాను నటించిన ఏదైనా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సమయంలో విమాన ప్రయాణం చేయాల్సి వస్తే మన్సూర్ ఖాన్‌కు ఒక నోట్ రాస్తాను. నాకు ఏదైనా జరిగితే పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమా పనులు నువ్వు చూసుకో అని అందులో పేర్కొంటాను. అలాగే దర్శకులకు కూడా ఇదే విషయాన్ని చెబుతాను. నాకు ఏమైనా అయితే సినిమాను ఆపేయొద్దని.. మన్సూర్ సలహాలతో పూర్తి చేసి విడుదల చేయాలని కోరతాను అని ఆమిర్ చెప్పారు.
దానికి కారణం ‘ఒకవేళ నా విమానం కూలిపోయి.. నేను చనిపోతే?’ అనే విషయం ఎప్పుడూ మనసులో ఎప్పుడూ అనిపించడమే దానికి కారణం అని ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్.. ఆమిర్ ఖాన్‌కు బంధువు అనే విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’, ‘జో జీతా వహీ సికందర్’ లాంటి సినిమాలు వచ్చాయి. ఆ రెండూ భారీ విజయం అందుకున్నాయి.
ఇదంతా విన్నాక ఓ హీరో అయి ఉండి ఇలా కూడా ఆలోచిస్తారా అనే డౌట్ రావొచ్చు. కానీ ఆమిర్ ఖాన్ అలాంటోడే. కొన్ని ఆలోచనలు, మాటలు ఆయన చెబుతుంటే ఆశ్చర్యమేస్తుంది. మొన్నీమధ్యే ఓ సినిమా చూస్తే కన్నీరు పెట్టేసుకున్నారు. దాని కంట ముందు కుమార్తె పెళ్లి సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇవన్నీ చేస్తూ సగటు మగాడు ఇలానే ఉంటాడు అని చెప్పకే చెప్పాడు ఆమిర్.