Amitabh, Prabhas: ప్రభాస్ సినిమాలకు రూ.1000 కోట్లు కామన్ అన్న అమితాబ్.. గర్వపడ్డానంటూ?

  • July 18, 2024 / 11:56 AM IST

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో అమితాబ్ (Amitabh Bachchan) కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలో ప్రభాస్ (Prabhas)  , అమితాబ్ అద్భుతంగా నటించి ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించడం జరిగింది. తాజాగా అమితాబ్ బచ్చన్ కల్కి సినిమా కలెక్షన్ల గురించి, కల్కి విజయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. నా వరకు నేను ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు ఆనందిస్తున్నానని తెలిపారు.

ఈ సినిమాను నేను ఎంతగా ఎంజాయ్ చేశానో చెప్పడానికి మాటలు చాలడం లేదని అమితాబ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే నాలుగుసార్లు కల్కి 2898 ఏడీ సినిమా చూశానని ఆయన వెల్లడించారు. సినిమా చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నానని అమితాబ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఇలాంటి సక్సెస్ లు ప్రభాస్ కు రొటీన్ గా మారాయని ఆయన వెల్లడించారు.

ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన చాలా సినిమాలు 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించాయని అమితాబ్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ సక్సెస్ రేట్ గురించి, ప్రభాస్ సినిమాల కలెక్షన్ల గురించి అమితాబ్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రభాస్ సినిమాలు కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపిస్తున్నాయి. ఎంతో అనుభవం ఉండి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అమితాబ్ ప్రభాస్ గురించి ఇంత గొప్పగా కామెంట్లు చేయడం సాధారణమైన విషయం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమితాబ్, ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో భారీ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ సినిమాలు క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం సలార్, కల్కిని మించేలా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus