టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరో సూర్యను (Suriya) అభిమానించే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రయోగాత్మక కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే సూర్య జయాపజయాలతో సంబంధం లేకుండా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. జులై 23వ తేదీ సూర్య పుట్టినరోజు కాగా ప్రతి సంవత్సరం సూర్య పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుగుతాయి. సూర్య ఫ్యాన్స్ సూర్య పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. 2023 సంవత్సరంలో ఏకంగా 2000 మంది సూర్య అభిమానులు రక్తదానం చేసి మంచి మనస్సును చాటుకున్నారు.
గతేడాది ఈ విషయం తెలిసిన సూర్య 2024లో తాను కూడా బ్లడ్ డొనేషన్ చేస్తానని ప్రకటించి ఇచ్చిన మాటకు కట్టుబడి బ్లడ్ డొనేషన్ చేశారు. సాధారణంగా స్టార్ హీరోలు బ్లడ్ డొనేషన్ చేయడం అరుదుగా జరుగుతుంది. హీరో సూర్య మాత్రం మాట తప్పకుండా ఫ్యాన్స్ తో కలిసి బ్లడ్ డొనేషన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా సూర్య రియల్ హీరో అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కంగువా (Kanguva) సినిమాతో సూర్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి సూర్య హాజరై బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. సూర్యతో పాటు 500 మంది ఫ్యాన్స్ సైతం బ్లడ్ డొనేట్ చేశారని భోగట్టా.
దానాలలో రక్తదానం ఎంతో గొప్పదని బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్నవాళ్లను కాపాడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూర్య సినిమాల బడ్జెట్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.