బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఇండియన్ సినిమా స్థాయిని అమాంతం పెంచిన అమితాబచ్చన్ ఇప్పటికీ ఎన్నో సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా,బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై కౌన్ బనేగా కరోడ్ పతి వంటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సంపాదించుకున్నారు. ఇలా ఏడు పదుల వయసులో కూడా అమితాబచ్చన్ వరుస సినిమాలలో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే అమితాబచ్చన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా 11:30 ల సమయంలో గుడ్ మార్నింగ్ విషెస్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్టుకు ఊహించని రీతిలో నెటిజన్ నుంచి రిప్లై వచ్చింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ పోస్ట్ పై స్పందించి ఇది మధ్యాహ్నం ముసలోడా అంటూ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే అమితాబచ్చన్ ఈ కామెంట్ చూసి ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా తనదైన శైలిలో ఆ నెటిజన్ కి రిప్లై ఇచ్చాడు.ఈ క్రమంలోనే అమితాబ్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ… గత అర్థరాత్రి సమయం వరకు షూటింగ్ లో పాల్గొని ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేచాను. అందుకే గుడ్ మార్నింగ్ విషెస్ కూడా లేటుగా పెట్టానంటూ రిప్లై ఇచ్చాడు.
మీరు చాలా కాలం బ్రతకాలని ప్రార్థిస్తున్నాను.. అలాగే మిమ్మల్ని ఎవరూ కూడా ముసలోడు అని అవమానపరచకూడదు అంటూ అమితాబ్ బచ్చన్ సదరు నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!