కోట్లు తీసుకొని కనీసం పబ్లిసిటీకి సహకరించలేదు

Advertisement

వరుసగా వచ్చిన పలు ఫ్లాపులు, డిజాస్టర్ల అనంతరం హీరోగా “ఛలో”తో బౌన్స్ బ్యాక్ అయిన నాగశౌర్య ఆ తర్వాత నుంచి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఎంత జాగ్రత్త అంటే.. తాను ఒప్పుకొన్న సినిమా ఫస్ట్ కాపీ చూసుకొని, అది నచ్చకపోతే ప్రమోషన్స్ కి రానంత. “కణం, అమ్మమ్మగారిల్లు” చిత్రాలే అందుకు నిదర్శనం. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో శౌర్య అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. “కణం” సినిమా కంటే హీరోయిన్ సాయిపల్లవితో ఇష్యూస్ వచ్చాయి కాబట్టి ప్రమోట్ చేయను అని పబ్లిక్ గానే చెప్పేశాడు సరే.. మరి “అమ్మమ్మగారిల్లు” సినిమాని ఎందుకు ప్రమోట్ చేయలేదు?.

ఈ విషయమై “అమ్మమ్మగారిల్లు” నిర్మాతకు సంబంధించిన కొందరు సీరియస్ అవుతున్నారు. కోట్ల రూపాయల డబ్బును రెమ్యూనరేషన్ గా మాత్రమే కాకుండా కొన్ని కోట్లు రెమ్యూనరేషన్ గానూ తీసుకొన్న శౌర్య.. సినిమా రిలీజ్ టైమ్ కి రెండు ప్రెస్ మీట్స్ కి అటెండ్ అవ్వడం తప్ప ప్రమోషన్స్ లో భాగస్వామి కాకపోవడం పట్ల ప్రొడ్యూసర్ టీం సీరియస్ అయ్యారు. మంచి సినిమా అనిపించుకొన్న “అమ్మమ్మగారిల్లు” సినిమాని శౌర్య కాస్త ప్రమోట్ చేసి ఉంటే కనీస స్థాయి విజయం సాధించేదని, ఇప్పుడు ఎటూ కాకుండాపోయిందని బాధపడుతున్నారు. మరి శౌర్య ఈ విషయాన్ని కాస్త పట్టించుకోకపోతే అనవసరంగా నిందలపాలు కావాల్సి ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus