Hero Nani: ‘దసరా’రోజు అనౌన్స్ చేయబోయే సినిమా ఇదే!

  • September 16, 2021 / 05:59 PM IST

నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా వినాయకచవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. రీసెంట్ గా ‘టక్ జగదీష్’ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకొచ్చిన నాని తన తదుపరి సినిమా విషయాలను వెల్లడించాడు. ఈ

ఏడాది దసరా రోజు తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయంలో బయటకొచ్చింది. ఈ సినిమాకి ‘దసరా’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట. అందుకే దసరా రోజే సినిమా టైటిల్ పోస్టర్ ను రివీల్ చేయాలనుకుంటున్నారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ ను లాక్ చేశారట. నటీనటులు, టెక్నీషియన్స్ ను కూడా ఫైనల్ చేశారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus