Bheemla Nayak: భీమ్లా నాయక్ గురించి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్!

  • July 28, 2021 / 01:54 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హై వోల్టేజ్ కాంబినేషన్ గా తెరకెక్కుతున్న ఏకైక సినిమా పవన్ కళ్యాణ్ – రానా అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్. ఈ సినిమా కోసం కేవలం మెగా అభిమానులు మాత్రమే కాకుండా మిగతా ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళం రీమేక్ అయినప్పటికీ ఆ పవర్ఫుల్ పాత్రల్లో పవర్ స్టార్ రానా ఎలా ఉంటారనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. సాధారణంగా రీమేక్ సినిమాలు అనగానే కొందరు అంతగా ఇంట్రెస్ట్ చూపరు.

కానీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ లాంటి రీమేక్ లో ఇలాంటి బడా స్టార్స్ కనిపిస్తే ప్రతి ఫ్రేమ్ మరోలా ఉంటుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు మాటలు అందించడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ అన్ని చూసుకుంటున్నాడు అంటే ఆ డ్రామా డోస్ మామూలుగా ఉండదు. ఈ సినిమను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో పవన్ కల్యాన్ బీమ్లా నాయక్ అనే ట్రైబల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

పవన్ పాత్రకు అలా పేరు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందట. గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తి భీమ్లా అనే ప్రాంతంలోనే ట్రైబల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. నిజానికి తెలంగాణ వరంగల్ జిల్లాలో బీమ్లా అనే గ్రామం ఉంది. ఆ బ్యాక్ డ్రాప్ లోనే కథ నదిస్తుందని సమాచారం. ఇక ఇటీవల కీలకమైన మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యింది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus