Ananya Nagalla: అనన్య కోలీవుడ్‌కి వెళ్లి మళ్లీ వస్తుందా?

  • April 16, 2022 / 11:47 AM IST

‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌లో పద్ధతైన అమ్మాయి పాత్రలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావడానికి ఎందుకు ముందుకురారు అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె ఎంట్రీ కనిపించింది. అయితే ఆ తర్వాత ఈ అమ్మడుకి ఆశించిన మేర అవకాశాలు రాలేదు. వచ్చినా.. అవి చిన్న చిన్న పాత్రలే అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చాలామంది తెలుగు అమ్మాయిల్లాగే తమిళ ఇండస్ట్రీలోకి వెళ్తోంది. ‘అంజల్‌’ అనే సినిమాతో అనన్య తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

Click Here To Watch NOW

శశికుమార్‌ హీరోగా రూపొందుతున్న చిత్రమిది. తంగమ్‌.పా.శరవణన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇ.మోహన్‌ నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశమంతా ప్రయాణించే ఓ ట్రావెలర్‌ కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శశికుమార్‌కు జోడీగా అనన్యను తీసుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.‘మల్లేశం’తో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నా… ‘వకీల్‌ సాబ్‌’ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ఆ తర్వాత ‘మ్యాస్ట్రో’ సినిమాలో చిన్న పాత్ర చేసింది. సమంత ‘శాకుంతలం’లో కీలక పాత్ర పోషించింది.

ఇవి కాకుండా చెప్పుకోదగ్గ పాత్రలేమీ ఆమె చేతిలో లేవు. ఈ క్రమంలోనే అనన్య కోలీవుడ్‌కి పయనం కట్టిందని చెబుతున్నారు. మన నాయికలు రావాలని అంటారు, కానీ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పోనీలే బయట రాష్ట్రాల నాయికల్లాగా అందాల విందుకు ఏమన్నా అనన్య వెనకడుగు వేస్తోందా అంటే… అస్సలు లేదనే చెప్పాలి. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు డబుల్‌ డోస్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అందాల ప్రదర్శనకు తానేమీ వ్యతిరేకం కానని సిగ్నల్స్‌ ఇస్తూ ఉంటుంది.

అయినా అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో శ్రీదివ్య, బింధుమాధవి, రక్షిత, అంజలి.. లాగా అనన్య కూడా కోలీవుడ్‌వైపు చూస్తోంది. దీంతో తెలుగమ్మాయిలు రావాలి అనే మాట అయినా మన వాళ్లు ఆపేయాలి. లేదంటే వచ్చేవాళ్లకు అవకాశాలు అయినా ఇవ్వాలి. లేదంటే ఇలానే ఇక్కడి నుండి అక్కడకి వలసలు ఉంటాయి అని చెప్పొచ్చు. కొంతమంది నాయికల్లాగా లేదంటే అక్కడే ఆమె ఉండిపోయే అవకాశం ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus