‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!

  • April 5, 2022 / 01:32 PM IST

మొదటి వారం పూర్తయ్యేసరికి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం భారీ వసూళ్ళను రాబట్టి… ‘బాహుబలి2’ రికార్డుని కొట్టింది. అయితే ప్రస్తుతానికి మనం తెలుగు రాష్ట్రాల్లోని వసూళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు అంటే ఇలాంటి రికార్డులు ఎక్కువ ఉండేవి. అయితే ఇప్పడు ఆ పరిస్థితి ఎక్కువగా లేదు. పెద్ద సినిమాలు తప్ప మిడ్ రేంజ్, చిన్న సినిమాలు వారం రోజుల పాటు నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఓటిటి అనేది ఒకటి జనాలకు అందుబాటులోకి వచ్చాక థియేటర్లకు రావడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒకవేళ ఆ సినిమాకి కనుక ప్లాప్ టాక్ వస్తే… వీకెండ్ తర్వాతే థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా సినిమాలు వాయిదా పడడంతో పెద్ద సినిమాలకి తప్ప.. మిడ్ రేంజ్ చిన్న సినిమాలకి సోలో రిలీజ్ దక్కడం కష్టమైపోతుంది.

ఇన్ని అవాంతరాల మధ్య మొదటి వారం భారీ వసూళ్ళను రాబట్టడం అంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడేది. కానీ ఇప్పుడు తేడా వస్తే ఇక్కడ కూడా దుకాణం సర్ధేయడం ఖాయం. అయినప్పటికీ మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను సాధించిన సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆ లిస్ట్ ను ఓసారి పరిశీలించి ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసి ఏ పొజిషన్లో ఉందో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి దర్శకత్వంలో చరణ్- ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ మూవీ మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.186.36 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. మొదటి వారం ‘బాహుబలి2’ వసూళ్ళను అధిగమించింది ఈ చిత్రం.

2) బాహుబలి2 :

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ మూవీ మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.117.77 కోట్ల భారీ షేర్ ను నమోదు చేసి ఆ టైంకి ఆల్ టైం రికార్డుని సృష్టించింది.

3) అల వైకుంఠపురములో :

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.88.25 కోట్ల షేర్ ను రాబట్టింది.

4) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం తెలుగు రాష్టాల్లో ఏకంగా రూ.84.82 కోట్ల షేర్ ను రాబట్టింది.

5) సైరా :

మెగా స్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.76.43 కోట్ల షేర్ ను నమోదు చేసింది.

6) సాహో :

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.75.67 కోట్ల షేర్ ను రాబట్టింది.

7) వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 71.32 కోట్ల షేర్ ను రాబట్టింది. తక్కువ టికెట్ రేట్లతో అదీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ టైములో కూడా ఇంత కలెక్ట్ చేయడం మాములు విషయం కాదు.

8) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.66.31 కోట్ల షేర్ ను రాబట్టింది.

9) పుష్ప :

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.64.25 కోట్ల షేర్ ను రాబట్టింది.

10) బాహుబలి ది బిగినింగ్ :

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.61.35 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డ్ ను సృష్టించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus