‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!

‘తొలివలపు’ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు గోపీచంద్. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. పైగా నిర్మాతలకి నష్టాలను మిగిల్చాయి. దాంతో సినిమాలకు తానూ సూట్ అవ్వనని, వాటి జోలికి పోకూడదు అని భావించి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు గోపీచంద్. ఇతనికి కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ అది ఇతనికి కలిసి రాలేదు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ గారి రెండో అబ్బాయే ఈ గోపీచంద్. ‘తొలివలపు’ తర్వాత ఇక సినిమాల జోలికి పోకూడదు అని గోపీచంద్ నిర్ణయించుకున్నప్పటికీ.. తన అన్న ప్రముఖ దర్శకుడు అయిన ప్రేమ్ చంద్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఏదో ఒక రకంగా సినిమాల్లో కొనసాగాలని డిసైడ్ అయ్యాడు.

ఆ టైములో విలన్ గా ‘జయం’ ‘నిజం’ ‘వర్షం’ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి ‘యజ్ఞం’ ‘రణం’ ‘లక్ష్యం’ ‘శౌర్యం’ ‘లౌక్యం’ వంటి హిట్లతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’, శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. అయితే ఇతని తండ్రి టి.కృష్ణ గారు దర్శకత్వం వహించిన సినిమాలు ఏంటనేది ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు తెలీదు.ఈయన సినిమాలు విప్లవాన్ని రేకెత్తించే విధంగా.. జనాల్లో చైతన్యం నింపేలా ఉంటాయి.స్వతహాగా ఆయన కమ్యూనిస్టు కాబట్టి.. ఆయన ఆలోచన శైలి ఎలా ఉంటుంది అనేది ఆయన సినిమాల ద్వారా బయటపెట్టారు.ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1) మొనగాడు :

శోభన్ బాబు జయసుధ జంటగా నటించిన ఈ మూవీని కమర్షియల్ మూవీగా మలిచారు టి.కృష్ణ గారు.

2) నేటి భారతం :

సుమన్, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాగానే ఆడింది. టి.కృష్ణ గారి దర్శకత్వ ప్రతిభ చూపించిన మూవీ ఇది.

3) దేశంలో దొంగలు పడ్డారు :

ఈ చిత్రంలో కూడా సుమన్, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా పర్వాలేదు అనిపించింది.

4) దేవాలయం :

ఈ మూవీలో శోభన్ బాబు, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు టి.కృష్ణ గారు ఈ మూవీని తెరకెక్కించిన విధానం కూడా అందరికీ నచ్చింది.

5) వందేమాతరం :

రాజశేఖర్, విజయశాంతి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది.

6) ప్రతిఘటన :

టి.కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన 6వ సినిమా ఇది. ఈ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుని ఎన్నో రికార్డులని క్రియేట్ చేసింది.

7) రేపటి పౌరులు :

విజయశాంతి, రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. టి.కృష్ణ గారిని దర్శకుడిగా మరో మెట్టు పైకెక్కించిన మూవీ ఇది.

8) పకరాతిను పకరం :

‘ప్రతిఘటన’ ను ‘పకరాతిను పకరం’ గా మలయాళంలో రీమేక్ చేసారు టి.కృష్ణ గారు. అక్కడ కూడా ఆయనే దర్శకుడు.

9) పుత్తడి బొమ్మ పూర్ణమ్మ :

ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ. దీనిని తెరకెక్కించింది కూడా టి.కృష్ణ గారే. స్వయంగా ఆయనే నిర్మించారు కూడా..!

10)ఉపాయంలో అపాయం :

కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా టి. కృష్ణ గారే. అయితే ఇది యావరేజ్ గా మాత్రమే ఆడింది.

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus