వైరల్ అవుతున్న అనన్య నాగళ్ళ ఫోటోలు..!

అనన్య నాగళ్ళ. ఈ పేరు వినడానికి కొత్తగా అనిపిస్తుందేమో కానీ ఈమె అందరికీ సుపరిచితమే. మన ప్రియదర్శి నటించిన ‘మల్లేశం’ చిత్రంలో నటించిందే ఆమెనే ఈ అనన్య. ఆ సినిమాలో ఎంత బాగా నటించిందండీ..! అందం,అభినయం కలిగిన అమ్మాయి. ‘మల్లేశం’ చిత్రంలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈమె నటించిన ‘ప్లే బ్యాక్’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో కూడా ఈమె చాలా బాగా నటించింది. చిన్న సినిమా కాబట్టి.. కొత్త సినిమాల పోటీ వల్ల నలిగిపోయింది. కానీ ఈ చిత్రం కూడా చూడదగిన సినిమానే. ఇక అనన్య ఏప్రిల్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో ఆమెది కూడా కీలక పాత్ర అని తెలుస్తుంది. కచ్చితంగా ఈ చిత్రంతో ఈమె పేరు మారుమోగిపోవడం.. మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. అనన్య ట్యాలెంట్ ను పసిగట్టిన సుకుమార్.. తన తరువాతి సినిమాలో ఈమెకు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ‘ప్లే బ్యాక్’ మూవీ డైరెక్టర్ హరి ప్రసాద్.. సుకుమార్ శిష్యుడే అన్న సంగతి తెలిసిందే.ఇటీవల ఈ సినిమాని చూసిన సుకుమార్ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించాడు. అందులో భాగంగా అనన్య పై ప్రశంసలు కూడా కురిపించినట్టు తెలుస్తుంది. ‘ఆర్. ఎక్స్.100’ హీరో కార్తికేయతో సుకుమార్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

ఆ చిత్రంలో హీరోయిన్ గా అనన్యను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని వినికిడి. హైదరాబాద్ అమ్మాయి కాబట్టి.. ప్రస్తుతం ఈమెను వెతుక్కుంటూ చాలా ఆఫర్లు వస్తున్నాయట. కుర్రకారుని కూడా తన గ్లామర్ తో నటనతో ఆకర్షించగల నటి కాబట్టి.. కచ్చితంగా ఈమె క్రేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో అనన్య ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటిని ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus