Ananya Nagalla: అనన్య అక్కడైనా ఆశించిన రిజల్ట్ ను సాధిస్తుందా..!

  • February 16, 2022 / 10:39 PM IST

ప్రియదర్శి హీరోగా నటించిన ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన అనన్య నాగళ్ల.. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ చిత్రంలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే గతేడాది వచ్చిన ‘వకీల్‌సాబ్‌’ చిత్రం ఈమెకు మంచి క్రేజ్‌ ను తెచ్చిపెట్టింది. దివ్య అనే అమాయకపు అమ్మాయి పాత్రలో ఈమె చాలా బాగా నటించింది. ‘వకీల్ సాబ్’ విజయాన్ని క్యాష్ చేసుకోవాలని ఈ అమ్మడు చాలా కష్టపడింది. వరుస పెట్టి ఫోటో షూట్లలో పాల్గొంది.

Click Here To Watch

మొదట కాస్త పద్దతిగా ఫొటోలకి ఫోజులిచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచి హాట్ హాట్ ఫోజులిచ్చింది.అయినా ఫలితం లేకపోయింది.నితిన్ ‘మాస్ట్రో’ వంటి చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం వచ్చింది కానీ పెద్ద సినిమాల్లో ఈమె ఎంపికకాలేకపోయింది. అయితే సైలెంట్ గా ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది అనన్య. కోలీవుడ్‌ క్రేజీ హీరో శశికుమార్‌ సినిమాలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది అనన్య.

ఈ విషయాన్ని స్వయంగా అనన్యనే తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి అంజల ఫేమ్ తంగం పా శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. సహ నటి పాత్రల్ని అనన్య బాగానే రాబట్టుకుంటుంది. కానీ కాస్త పేరున్న సినిమాల్లో అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోతుంది. మరి తమిళ్ మూవీతో అయినా ఈమెకు సరైన బ్రేక్ వస్తుందా లేదా అనేది చూడాలి..!

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus