Anasuya: మనిషిలా లేని కుక్కల్ని నమ్మండి!: అనసూయ

Advertisement

అనసూయా బుల్లి తెర యాంకర్ గా గుర్తింపు పొంది ప్రస్తుతం వెండి తెరపై నటిగా కొనసాగుతున్నారు. బుల్లితెర జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వెండితెర సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే అనసూయ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా అనసూయ షేర్ చేసే పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటాయి.

ఇలా ఈమె నెటిజన్స్ తో పెద్ద ఎత్తున వివాదాలకు వెళ్లిన సంగతి కూడా మనకు తెలిసిందే. గతంలో ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియాలో మరొక పోస్ట్ చేశారు. విశ్వాసం నమ్మకం అంటూ అనసూయ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. కుక్కలా విశ్వాసంగా లేని మనుషులను ఎప్పటికీ నమ్మకండి… మనిషిలా లేని కుక్కలను మాత్రమే నమ్మండి అంటూ ఈ సందర్భంగా అనసూయ (Anasuya) చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇలా ఈ పోస్టును ఈమె షేర్ చేస్తూ ప్రస్తుతం మనుషుల కంటే జంతువులే చాలా విశ్వాసంగా ఉంటున్నాయని మనుషులు నమ్మకద్రోహం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈమె ఇలాంటి పోస్ట్ చేశారని అర్థమవుతుంది. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా నటిస్తూ ఈమె బిజీ అయ్యారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus