Bootcut Balaraju Review in Telugu: బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 3, 2024 / 10:49 AM IST

Cast & Crew

  • స‌య్యద్ సోహైల్ (Hero)
  • మేఘలేఖ (Heroine)
  • అనన్య నాగళ్ల , ఇంద్రజ , వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, ఝాన్సి, సిరి హనుమంత్ , జబర్దస్త్‌ రోహిణి తదితరులు (Cast)
  • శ్రీ కొన్నేటి (Director)
  • బెక్కెం వేణుగోపాల్ (Producer)
  • భీమ్స్ సిసిరోలియో (Music)
  • శ్యామ్ కె.నాయుడు (Cinematography)

బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నంలో ఈసారి సొంతంగా డబ్బులు పెట్టి మరీ నిర్మించిన సినిమా “బూట్ కట్ బాలరాజు”. శ్రీ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కనీస స్థాయి బజ్ లేదు, అందుకు కారణం సరైన ప్రమోషన్స్ లేకపోవడం. అయితే.. సొహైల్ మాత్రం ప్రీరిలీజ్ ఈవెంట్లో దయచేసి సినిమా చూడండి, మా నాన్న పెన్షన్ డబ్బులు పెట్టి సినిమా తీశాను అని స్టేజ్ పై కన్నీరు పెట్టుకోవడంతో, సినిమా అందరి నోళ్లలో నానడం మొదలైంది. మరి సొహైల్ పెట్టిన డబ్బులికి రిజల్ట్ ఎలా ఉంది? అనేది చూద్దాం..!!

కథ: ఉద్యోగం గట్రా లేకుండా జాలీగా ఫ్రెండ్స్ తో తిరుగుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు బాలరాజు (సొహైల్). తనను ప్రేమించిన మహాలక్ష్మి (మేఘలేఖ) కోసం మారాలి అనుకుంటాడు. తన మార్పును ఊరంతా గుర్తించాలంటే.. సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలవడం ఒక్కటే మార్గమని భావించి, ఇంద్రావతి పటేల్ (ఇంద్రజ)కు పోటీగా నిలుస్తాడు.

ఈ పందెంలో బాలరాజు గెలిచాడా? తన సత్తాను చాటుకోగలిగాడా? ఊరి ప్రజలు బాలరాజును నమ్మారా? వంటి ప్రశ్నలకు సమాధానమే “బూట్ కట్ బాలరాజు” చిత్రం.

నటీనటుల పనితీరు: పనీపాటా లేని సాదాసీదా యువకుడిగా బాలరాజు పాత్రలో ఒదిగిపోయాడు సొహైల్. మహాలక్ష్మి అనే పల్లెటూరి యువతిగా మేఘలేఖ కూడా పర్వాలేదనిపించుకుంది. ఇంద్రజకు మంచి పాత్ర లభించింది. సునీల్, సద్దాం, అవినాష్ వంటి కామెడియన్స్ ఉన్నప్పటికీ.. కామెడీ మాత్రం పండలేదు.

సాంకేతికవర్గం పనితీరు: ఓ సాధారణమైన కథను, అసాధారణంగా చెప్పాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ.. అందుకోసం చక్కని స్క్రీన్ ప్లే రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో శ్రీ కోనేటి విఫలమయ్యాడు. సినిమా టెంప్లేట్ మొత్తం ఇప్పటికే కొన్ని వందలాసార్లు చూసేసి ఉంటాం. కనీసం కథనం, డైలాగుల విషయంలోనైనా కొత్తదనం ఉంటే బాగుండేది. ఇవేమీ లేకపోవడంతో రెండున్నర గంటల చిత్రం బోర్ కొడుతుంది. భీమ్స్ పాటలు, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటివన్నీ సోసోగా ఉన్నాయి.

శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ వర్క్ ఒక్కటే సినిమా మొత్తానికి చెప్పుకోదగ్గ విషయం. సినిమాకి బడ్జెట్ కి మించిన అవుట్ పుట్ ఇచ్చాడు. ఇంతకుమించి టెక్నికాలిటీస్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

విశ్లేషణ: సినిమాకు రండి, ఆదరించండి అని ప్రేక్షకుల్ని వేడుకోవడానికి ముందు.. కంటెంట్ డిసైడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని సొహైల్ పట్టించుకోకుండా.. “బిగ్ బాస్ అప్పుడు కామెంట్స్ పెట్టారు, ఇప్పుడు థియేటర్లకు ఎందుకు రారు” అని ఆడియన్స్ ను ప్రశ్నించడం ఎంతవరకూ కరెక్ట్ అనేది అతడికే తెలియాలి.

రేటింగ్: 1.5/5

Click Here to Read in ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus