Miss Perfect Review in Telugu: మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అభిజీత్ (Hero)
  • లావణ్య త్రిపాఠి (Heroine)
  • అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్ధన్, మహేశ్ విట్టా, హర్ష్ రోషన్ తదితరులు (Cast)
  • విశ్వక్ ఖండేరావ్ (Director)
  • ప్రియ యార్లగడ్డ (Producer)
  • ప్రశాంత్ ఆర్ విహారి (Music)
  • ఆదిత్య జవ్వాది (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 2, 2024

ఈ వారం అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా పలు క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో ‘మిస్ పర్ఫెక్ట్’ కూడా ఒకటి. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో ‘బిగ్ బాస్ 4’ విన్నర్ అయిన అభిజీత్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ వెబ్ సిరీస్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ: లావణ్య అలియాస్ లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) కి క్లీన్ గా ఉండటం అంటే ఇష్టం. ‘మహానుభావుడు’ లో శర్వానంద్ టైపు అనమాట. ఇంకో రకంగా ఓసీడీ అనొచ్చు.ఈ కారణం వల్ల ఆమె చాలా కోల్పోతుంది.బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కూడా అవుతుంది. అటు తర్వాత ఈమె హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది. ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఆమె దిగుతుంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో వంట మనిషిగా జ్యోతి (అభిజ్ఞ) చేరుతుంది. ఆమె పక్క ఫ్లాట్ లో రోహిత్ (అభిజీత్) ఉంటాడు. అతని ఫ్లాట్ లో కూడా జ్యోతినే వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది.

అయితే కోవిడ్ కారణంగా ఆమె పనికి రాలేకపోతుంది. అదే విషయాన్ని రోహిత్‌కు చెప్పమని లావణ్యని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోతి. ఆ విషయం చెప్పడానికి వెళ్తే రోహిత్ ఫ్లాట్ అంతా చిందరవందరగా ఉంటుంది. అది చూసి తట్టుకోలేక లావణ్య క్లీన్ చేయడం మొదలుపెడుతుంది. అలా కొన్ని రోజుల పాటు అలాగే జరుగుతుంది. ఈమె జ్యోతి ప్లేస్ లో వచ్చిన పనిమనిషి అనుకుంటాడు రోహిత్. పైగా లావణ్య కూడా తన పేరు లక్ష్మీ అని చెబుతుంది. ఈ క్రమంలో ఆమె పై మనసు పారేసుకుంటాడు రోహిత్. అయితే చివరికి ఏమైంది? అతని ప్రేమ ఫలించిందా? లేదా? అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు: లావణ్య రోల్ బాగుంది. అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె కూడా బాగా చేసింది. కానీ ఈ క్యారెక్టర్ ను బేస్ చేసుకుని ఇంకా కామెడీ పండించే ఛాన్స్ ఉంది. ఎందుకో లావణ్యకి అలాంటి ఛాన్స్ దక్కలేదు. అభిజీత్ రోల్ రెగ్యులర్ షార్ట్ ఫిలిమ్స్ లో చూసే హీరో రోల్ లానే ఉంది. అంతకు మించి కొత్తగా ఇంప్రెస్ చేసే విధంగా ఏమీ లేదు.అభిజ్ఞ కొంత వరకు పర్వాలేదు అనిపించింది. మిగిలిన నటీనటులు అయిన ఝాన్సీ, హర్షవర్ధన్, మహేశ్ విట్టా, హర్ష్ రోషన్ ..ల పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయవు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘స్కై ల్యాబ్’ ఫేమ్ విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. అతను ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తగా ఏమీ ఉండదు. లావణ్యని ఈ సిరీస్ కోసం ఎంపిక చేసుకోవడం తప్ప… దర్శకుడిగా దీని ద్వారా సత్తా చాటింది అంటూ ఏమీ లేదు. కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. అలాంటి ప్రయత్నం విశ్వక్ చేయలేదు. ఒకేచోటు కథని మొత్తం తిప్పి తిప్పి చెప్పే ప్రయత్నం చేశాడు.

ఒకవేళ ఇదే వెబ్ సిరీస్ కోవిడ్ టైంలో వస్తే.. ప్రేక్షకుల ఆదరణ పొందేదేమో. ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ కలిగించేలా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టు ఉన్నాయి. వాటికి పేరు పెట్టడానికి ఏమీ లేదు. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్లెజెంట్ ఫీలింగ్ ను కలిగించింది. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ కూడా బాగానే అనిపిస్తుంది.

విశ్లేషణ: ‘మిస్ పర్ఫెక్ట్'(Miss Perfect) .. పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు, ఎంగేజ్ చేసిందీ లేదు.ఓపిక ఉంటే ఓటీటీ కంటెంటే కాబట్టి ఒకసారి లుక్కేయండి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో 8 ఎపిసోడ్లుగా అందుబాటులో ఉంది.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus