Anasuya: కుటుంబానికి దూరంగా.. అనసూయ దీపావళి సెలబ్రేషన్స్?

  • October 25, 2022 / 07:28 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పి వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వెండితెర సినిమాలలో నటిస్తూ వరుస సినిమా షూటింగులతో అనసూయ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అనసూయ కథ కొన్ని రోజుల నుంచి యూఎస్ఏ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.

అనసూయ తన కుటుంబంతో కాకుండా ఒంటరిగా యూఎస్ఏ లో ఉన్నారు. అయితే ఈమె ఏదైనా షూటింగ్ నిమిత్తం యూఎస్ఏ వెళ్లారా అనే విషయం తెలియక పోయినప్పటికీ గత కొన్ని రోజులుగా ఈమె యూఎస్ఏ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 24వ తేదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే అనసూయ యూఎస్ఏ లో ఉన్నటువంటి తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

తన కుటుంబానికి దూరంగా ఈమె యుఎస్ఏ లో తన స్నేహితులు బంధుమిత్రులతో పెద్ద ఎత్తున దీపావళి పండుగను జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉన్నారు

త్వరలోనే, పుష్ప 2, సినిమాతో బిజీగా ఉన్నారు.అదేవిధంగా కన్యాశుల్కం అని ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో అనసూయ మొదటిసారి ఒక వేశ్య పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి బుల్లితెర కార్యక్రమాలకు అనసూయ గుడ్ బై చెప్పినప్పటికీ వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus