బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న ఈమె అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకోవడంతో సినిమా షూటింగులతో బిజీ అయ్యారు. ఇలా సినిమా షూటింగులతో అనసూయ బిజీ కావడంతో బుల్లి తెర కార్యక్రమాలకు ఈమె దూరమయ్యారు. ఈ విధంగా అనసూయ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ అభిమానులను రెచ్చగొడుతుంటారు.
ఇలా అభిమానులను రెచ్చగొడుతూ ఈమె షేర్ చేసే ఫోటోలు వల్ల పెద్ద ఎత్తున నేటిజన్ ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.ఇప్పటికే అనసూయ ఎన్నోసార్లు నెటిజన్ల ట్రోలింగ్ కి గురైనప్పటికీ ఈమె మాత్రం తగ్గేదేలే అంటూ తనదైన శైలిలో పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం అనసూయ అమెరికాలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అమెరికా వీధులలో పర్యటిస్తూ అక్కడ వెరైటీ రకాల ఫుడ్ టెస్ట్ చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా ఈమె వెరైటీ ఫుడ్ టేస్ట్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మరోసారి నేటిజెన్లను గెలికారు. ఈ క్రమంలోనే అనసూయ ఆ ఫోటోని షేర్ చేస్తూ హే వుచ్చు చూడండి, నేను కొంత ఫుడ్ తీసుకుంటున్నా. ఆ తర్వాత మరికొంత ఎక్కువ తీసుకుంటున్నా. తర్వాత ఇంకొంత తీసుకుంటున్నా. మీకు ఏదైనా సమస్య ఉందా?అంటూ వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ..
నీతిండేదో నువ్వు తినకుండా ఇలా మమ్మల్ని గెలకడం అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం తినడం కోసమే పుట్టావా అనసూయ మరి ఎక్కువగా తినకు షేప్ అవుట్ అవుతావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అతిగా తింటే ఆంటీ కాస్త బామ్మ అవుతావు జాగ్రత్త అంటూ నేటిజన్ లు యధావిధిగా తనపై కామెంట్లు చేస్తున్నారు.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!