ఆ వెబ్ సిరీస్ ను అనసూయ తెగ పొగిడేస్తోందిగా..!

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్ళల్లోనే ఉండడంతో… డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో దీనిని మరింతగా క్యాష్ చేసుకోవాలని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ భావిస్తున్నాయి. అందులో భాగంగా వరుసగా వారు కొనుగోలు చేసిన కొత్త సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తున్నారు. ఇక థియేటర్లు కూడా ఎలాగూ ఓపెన్ లో లేవు కాబట్టి.. ప్రేక్షకులు కూడా ఈ వెబ్ సిరీస్ లను చూసి తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా ద్వారా ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు.

ఇక మన స్టార్ యాంకర్ అనసూయ కూడా ఓ వెబ్ సిరీస్ ను చూసిందట. ఆ వెబ్ సిరీస్ తనకు తెగ నచ్చేసిందట. ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది మన రంగమ్మత్త. ఇంతకీ అనసూయను అంతలా ఇంప్రెస్ చేసిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా? ‘పాతాళ్ లోక్’..! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మిచిన ఈ వెబ్ సిరీస్ మే 15న విడుదలైంది. ప్రేక్షకుల ఈ వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక మన అనసూయ కూడా ఈ వెబ్ సిరీస్ ను ప్రశంసిస్తూ.. ‘ ‘పాతాళ్ లోక్’ అద్బుతమైన వెబ్ సిరీస్.! ఇప్పటి వరకూ నేను చూసిన వాటిలో ఇదే నా ఫేవరెట.! నటీనటుల నటన, మేకింగ్ అన్నీ అదిరిపోయాయి. సిరీస్ ను ముగించిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వెబ్ సిరీస్ ఇదని నేను అనుకుంటున్నాను’ అంట చెప్పుకొచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్’ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు మరింత ఆధరణ పెరుగుతున్నట్టే కనిపిస్తుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus