Anasuya: సంతోషం ఓటీటీ అవార్డు సొంతం చేసుకున్న అనసూయ!

Advertisement

అనసూయ భరద్వాజ్ ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం వెండితెర నటిగా పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈమె ప్రేమ విమానం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఓటిటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ తాజాగా ఉత్తమ సహాయ నటిగా అవార్డు సొంతం చేసుకున్నారు.

అనసూయ నటించిన ప్రేమ విమానం సినిమాలో ఈమె ఒక సాధారణ గృహిణి శాంతా పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇందులో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో అనసూయ నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఈ సినిమా ఇటీవల జీ5 ఓటిటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో శాంత పాత్రకు గాను ఈమెకు ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు.

సంతోషం ఓటీటీ అవార్డ్స్‌లో ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈమె ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును సీనియర్ నటి జయసుధ చేతుల మీదుగా తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అనసూయ అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ తెలియజేయగా ఈమె థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే (Anasuya)  అనసూయ ప్రస్తుతం మరికొన్ని సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని చెప్పాలి ఇక త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా అనసూయ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus