Sapta Sagaralu Dhaati Side B Review in Telugu: సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 17, 2023 / 12:54 PM IST

Cast & Crew

  • రక్షిత్ శెట్టి (Hero)
  • రుక్మిణీ వసంత్ (Heroine)
  • అచ్యుత్ కుమార్, చైత్ర ఆచర్ తదితరులు.. (Cast)
  • హేమంత్ఎం.రావ్ (Director)
  • రక్షిత్ శెట్టి (Producer)
  • చరణ్ రాజ్ (Music)
  • అద్వైత గురుమూర్తి (Cinematography)
  • Release Date : నవంబర్ 17, 2023

కన్నడలో తెరకెక్కిన “సప్త సాగర దాచే ఎల్లో” అనే సినిమా సౌత్ లో సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ చిత్రాన్ని మిగతా భాషల్లోనూ అనువాదరంరూపంలో కాస్త లేట్ గా విడుదల చేశారు. ఇప్పుడు సీక్వెల్ ను మాత్రం లేట్ గా కాకుండా ఏకకాలంలో అన్నీ సౌత్ లాంగ్వేజస్ లో రిలీజ్ చేశారు చిత్రబృందం. మరి సైడ్ ఏ తోనే విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, సైడ్ బీతో ఏ స్థాయిలో అలరించిందో చూద్దాం..!!

కథ: పదేళ్ళ జైలు శిక్ష అనుభవించిన మను (రక్షిత్ శెట్టి).. జైల్లో తనకు సన్నిహితుడైన గోపాల్ దగ్గరకి వస్తాడు. దొరికిన పని చేసుకుంటూ, కుదిరినప్పుడల్లా ప్రియ (రుక్మిణీ వసంత్) ఆఖరిసారి పంపిన ఆడియో టేప్ వింటూ జీవితాన్ని సాగిస్తాడు. ఒకానొక సందర్భంలో తాపం తీర్చుకోవడం కోసం సురభి (చైత్ర) వద్దకు వెళ్ళి.. ఆమెలో ప్రియను చూసుకొని, ఆమెను ప్రేమించడం మొదలెడతాడు మను. అయితే.. ప్రియ జీవితం ఆమె ఊహించినట్లుగా లేదని, చాలా కష్టాలు పడుతుందని తెలుసుకొని, వాటిని తీర్చడం కోసం నడుం బిగిస్తాడు. ఆ క్రమంలో మను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ప్రియతో మునుపటిలా పాట పాడించగలిగాడా? అనేది “సప్త సాగరాలు దాటి సైడ్ బి” కథాంశం.

నటీనటుల పనితీరు: సైడ్ ఏలో లవర్ బోయ్ లా ఆకట్టుకున్న రక్షిత్ శెట్టి.. సైడ్ బిలో రగ్గడ్ గెటప్ లో రఫ్ నేచర్డ్ వ్యక్తిగా అలరించాడు. అతడి పాత్రలోని బాధ అతడి కళ్ళల్లో కనిపిస్తుంది. బాధ, కోపం, క్రోధం, జాలి, ప్రేమ లాంటి ఎమోషన్స్ ను అద్భుతంగా పండించాడు. గోపాల్ గా నటించిన గోపాల్ కృష్ణదేశ్ పాండే పాత్ర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

అతడి డైలాగులు కొన్ని ఆడియన్స్ మనసులో మాటలు తెరపై వినిపించేలా చేశాయి. మాస్ ఆడియన్స్ ఈ క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతారు. హీరోయిన్లు రుక్మిణీ వసంత్, చైత్రలు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇద్దరిలోనూ కామన్ ఎమోషన్ అయిన బేలతనాన్ని వాళ్ళ ముఖారవిందాలు బాగా ఎమోట్ చేస్తాయి. నెగిటివ్ రోల్లో రమేష్ ఇంద్ర జీవించేశాడు.

సాంకేతికవర్గం పనితీరు: చరణ్ రాజ్ సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టు. మనసు పొరల్లో దాక్కున్న ఎమోషన్స్ ను తన సంగీతంతో బయటకు ఈడ్చుకొచ్చి మరీ ఏడిపించేశాడు. కథ-కథనం కదలకపోయినా.. తన సంగీతంతో ప్రేక్షకుల్ని కదిలించాడు చరణ్ రాజ్. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్. చాలా విషయాలను, ఎమోషన్స్ ను సింబాలిక్ గా తెరపై ప్రెజంట్ చేసిన తీరు అతడి ప్రతిభను ఘనంగా చాటుతుంది.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ ను మెచ్చుకోవాలి. ఎందుకంటే.. ఆర్ట్ వర్క్ సినిమాలో చాలా కీలకం. సినిమాలోని ఎమోషన్ & క్యారెక్టర్ మూడ్ ని బట్టి బ్యాగ్రౌండ్ సెట్ చేశారు. అందువల్ల.. ప్రేక్షకులు సినిమాలోని లేదా పాత్రల్లోని ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అవుతారు. సినిమా చూస్తున్నంతసేపూ కూడా దర్శకుడు హేమంత్ రావు.. ఈ చిత్రాన్ని తొలి భాగంతోనే ముగించి ఉంటే బాగుండేది అనిపించింది. అందుకు కారణం స్క్రీన్ ప్లే. అసలే కథ కదలడం లేదు అంటే కథనం ఇంకా సాగదీశాడు.

అయితే.. దర్శకుడిగా మాత్రం తన మార్క్ చూపించాడు. మరీ ముఖ్యంగా ప్రియాను చూడడం కోసం మను పరితపించే విధానం, క్లైమాక్స్ & మను-ప్రియాలు కలుసుకొని కల సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఇంత మంచి టేకింగ్ కి మంచి డ్రామా & స్క్రీన్ ఉండి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది.

విశ్లేషణ: సైడ్ ఏ చూసిన ప్రేక్షకులకు ఈ సైడ్ బి నుంచి ఏం ఆశించాలి అనే ఒక క్లారిటీ ఉంది. “సప్త సాగరాలు దాటి” చిత్రం ఆ రేంజ్ లోనే ఉంది. కాకపోతే.. డ్రామాలో ఉన్న ఎమోషన్ కథనంలో లేదు. అందువల్ల.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఎప్పుడు అయిపోతుందా అన్నట్లు వెయిట్ చేస్తుంటాడు. అయినప్పటికీ.. చరణ్ రాజ్ సంగీతం, అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ & మను పాత్రలోని ఎమోషన్ కోసం ఈ చిత్రాన్ని చూడొచ్చు!

రేటింగ్: 2/5

Click Here to Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus