తెలుగు బుల్లితెరపై యాంకర్ గా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్గా పనిచేసినప్పటికీ అనంతరం యాంకర్ గా మారారు. అయితే పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయకు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న అనసూయకు ఏకంగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. జబర్దస్త్ కార్యక్రమంలో గ్లామర్ యాంకర్ గా పేరు పొందిన ఈమెకు వెండితెరపై పలు సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో వెండితెరపై ఫోకస్ పెట్టారు.
రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా అనసూయకు మంచి పేరు వచ్చింది.ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించకుండా పూర్తిగా సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.
అయితే కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా అనసూయ చేసే పోస్టులు తీవ్ర వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి. ఇలా ఎన్నోసార్లు వివాదాలను ఎదుర్కొన్నటువంటి ఈమె పెద్ద ఎత్తున నేటిజన్ల ట్రోలింగ్ కి కూడా గురైంది.ఇదిలా ఉండగా తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ వేదికగా మరొక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇందులో భాగంగా అనసూయ నేను చాలా దెబ్బ తిన్నానని నేను హర్ట్ అయిన విధంగా ఎవరిని హర్ట్ చేయలేదంటూ ఈమె చేస్తున్న పోస్ట్ వైరల్ అవ్వడంతో అనసూయను అంతలా బాధపెట్టిన వాళ్ళు ఎవరు అంటూ అభిమానులు ఈ పోస్టు గురించి చర్చలు జరుపుతున్నారు.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?