Anasuya: అలా అంటే గర్వంగా ఉంటుంది.. అనసూయ కామెంట్స్ వైరల్!

  • April 25, 2023 / 02:40 PM IST

అందాల యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే తాజాగా ఈ యాంకరమ్మ స్లీవ్ లెస్ బ్లౌజ్ మోడ్రన్ శారీలో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.

మత్తెక్కించే చూపులతో, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ ఫోటోలు ఉండడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన అనసూయ ఈ ఫోటోలకు క్యాప్షన్ జోడిస్తూ ఏ విషయమైనా అనసూయ అసలు సైలెంట్ గా ఉండదు. నోరు అదుపులో పెట్టుకోదు అంటుంటారు. అందరూ తనని అలా అనడం ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదని పైగా అలా అనడంతో తనకు చాలా గర్వంగా ఉంటుందని ఈ ఫోటోలకు ట్యాగ్ లైన్ జత చేశారు.

ప్రస్తుతం అనసూయ (Anasuya) షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక అనసూయ కెరియర్ విషయానికి వస్తే ఇన్ని రోజులు జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ వెండితెరపై బిజీగా గడుపుతున్నారు.

తాజాగా ఈమె నటించిన రంగమార్తాండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈమె పుష్ప 2 సినిమాతో పాటు మరికొన్ని సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus