Rithu Chowdary: యాంకర్ రీతూ చౌదరి కొన్న కొత్త కారు ఖరీదు అన్ని లక్షలా?

  • June 19, 2024 / 05:53 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా రీతూ చౌదరికి మంచి గుర్తింపు ఉండగా ఈ స్టార్ యాంకర్ ప్రముఖ యూట్యూబ్ టాక్ షోలతో బిజీగా ఉండటంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు. టొయాటో హైక్రాస్ లగ్జరీ కారును రీతూ చౌదరి కొనుగోలు చేయగా ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ కారు ఖరీదు 32 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం.

కారు డెలివరీ తీసుకుంటున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా రీతూ చౌదరి షేర్ చేయగా రీతూ చౌదరి పోస్ట్ కు దాదాపుగా లక్ష 30 వేల లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కావడంతో రీతూ చౌదరికి భారీ స్థాయిలో ఆదాయం వస్తోందని సమాచారం అందుతోంది. కొత్త కారు కొనుగోలు చేసినందుకు ప్రముఖ సెలబ్రిటీలు సైతం రీతూ చౌదరికి శుభాకాంక్షలు తెలియజేస్తుండటం గమనార్హం.

రీతూ చౌదరికి ఇన్ స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా ఆమె మాత్రం కేవలం 220 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. రీతూ చౌదరి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. రీతూ చౌదరి పోస్టుల కింద కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రీతూ చౌదరి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

రీతూ చౌదరి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటాలని అభిమానులు ఫీలవుతున్నారు. సినిమాలపై ఫోకస్ పెడితే రీతూ చౌదరి ఎంతో సక్సెస్ అవుతారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీతూ చౌదరి మాత్రం కెరీర్ ను ఒకింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. రీతూ చౌదరి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి ఆమె సత్తా చాటుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus