‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా రిలీజ్ వాయిదా పడింది. దానికి టీమ్ కారణం కూడా చెప్పింది. అయితే ఆ కారణం చాలా రెగ్యులర్. ప్రతి పెద్ద సినిమా వాయిదా పడినప్పుడు ఈ కారణమే చెబుతారు కూడా. అయితే నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ మాత్రం వేరే కారణం చెబుతున్నారు. దానికి రీసెంట్‌గా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ముడిపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అదే అసలు కారణం అని కూడా అంటున్నారు. ‘భయపడ్డావా లేక జాగ్రత్త పడ్డావా బన్నీ’ అని నేరుగా అడిగేస్తున్నారు కొందరు.
‘పుష్ప 2’ సినిమా రిలీజ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్, ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లారు. ముందుగా చెప్పినట్లు ఆగస్టు 15న కాకుండా డిసెంబర్ 6న సినిమాను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడుతుంది అని ఓ పది, పదిహేను రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సినిమా రిలీజ్ ఆ రోజునే అని చెప్పేసరికి ‘పుష్ప 2’ రాదు అని ఫిక్స్ అయిపోయారు. అనౌన్స్‌మెంట్‌తో క్లియర్ అయిపోయిది.
ఈ నేపథ్యంలో నెటిజన్లు తమ కామెంట్ల జోరును పెంచేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీ ఇటీవలి ఎన్నికల్లో వంద శాతం స్ట్రయిక్ రేట్‌తో 21 స్థానాల్లో గెలిచింది. అంతేకాదు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఇంత జరిగినా అల్లు అర్జున్ నుండి పవన్‌కి సరైన శుభాకాంక్షలు లేవు అనేది అభిమానుల బాధ. దాంతోపాటు ప్రచార సమయంలో పవన్‌కు సపోర్టుగా ట్వీటేసి.. వైసీపీ కోసం నంద్యాల వెళ్లి శిల్ప రవి చంద్రకిషోర్‌కు ప్రచారం చేశారు. అప్పుడే గుర్రుగా ఉన్న ఫ్యాన్స్.. ఈ మధ్య మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల ప్రచారంతో ఇటు జనసేనకు, అటు టీడీపీకి బన్నీ దూరమయ్యాడు అని చెప్పాలి. ఈ సమయంలో సినిమా రిలీజ్, ప్రత్యేక అనుమతులు అంత ఈజీ కాదు. అందుకే పరస్థితి కాస్త సద్దుమణిగాక సినిమా రిలీజ్ చేయొచ్చని అనుకున్నారని, అందుకే డిసెంబరుకు వెళ్లారని నెటిజన్లు ఓ కథను సిద్ధం చేశారు. అయితే అసలు కారణం ఏంటి అనేది సినిమా టీమ్‌కే తెలుస్తుంది.