Alka Yagnik: అరుదైన సమస్య వల్ల వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ఇతర ఇండస్ట్రీలలో 25కు పైగా భాషల్లో పాటలు పాటు అల్కా యాగ్నిక్ (Alka Yagnik) మంచి పేరు సంపాదించుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ సీనియర్ గాయని గాత్రానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అరుదైన సమస్యతో ఈ గాయని వినికిడి శక్తి కోల్పోవడం హాట్ టాపిక్ అవుతోంది. న్యూరల్ నెర్వ్ సెన్సోరీ లాస్ అనే అరుదైన సమస్య వల్ల తాను వినికిడి శక్తిని కోల్పోయానని ఈ గాయని పేర్కొన్నారు.

కొన్ని వారాల క్రితం తాను విమానం నుంచి బయటకు వచ్చిన వెంటనే వినికిడి శక్తిని కోల్పోయానని ఆమె వెల్లడించారు. తన అభిమానులు లౌడ్ మ్యూజిక్ కు, హెడ్ ఫోన్స్ కు వీలైనంత దూరంగా ఉండాలని ఆమె కోరారు. గత కొన్నిరోజులుగా నేను ఎందుకు బయట ఎవరికీ కనిపించడం లేదు అనే ప్రశ్నకు జవాబుగా ఈ పోస్ట్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. వైరల్ అటాక్ వల్ల తాను వినికిడి శక్తిని కోల్పోయానని ఈ సింగర్ తెలిపారు.

ఈ విధంగా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చారు. త్వరలోనే నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని అల్కా యాగ్నిక్ అన్నారు. పలు రియాలిటీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించిన ఈ సింగర్ 90లలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. 21 వేలకు పైగా పాటలు పాడారంటే ఈ సింగర్ ప్రతిభ ఏంటో సులువుగా అర్థమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అల్కా యాగ్నిక్ పేరుపై గిన్నీస్ రికార్డ్ కూడా ఉంది. 2022 సంవత్సరంలో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్ట్ గా ఈ సింగర్ గిన్నీస్ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. 2022 సంవత్సరంలో అల్కా పాడిన పాటలు ఏకంగా 15.3 బిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. అల్కా అరుదైన సమస్య బారిన పడటంతో అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆమె త్వరగా ఈ సమస్య నుంచి కోలుకోవాలని కొంతమంది అభిమానులు దేవుడిని ప్రార్థిస్తూ పూజలు జరిపిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus