Sreemukhi: శ్రీముఖిపై శేఖర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

తెలుగులోని పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి కొన్ని వారాల క్రితం సిక్త్ సెన్స్ షోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు ముద్దులు పెట్టిన సంగతి తెలిసిందే. శేఖర్ మాస్టర్ పెళ్లై పిల్లలున్న వ్యక్తి కావడంతో కొంతమంది నెటిజన్లు శ్రీముఖిని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తనపై ట్రోల్స్ వచ్చినా శ్రీముఖి వాటిని పట్టించుకోకుండా తాజాగా మరోసారి శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టారు. తాజాగా కామెడీ స్టార్స్ ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ ప్రోమో రిలీజ్ కాగా శ్రీముఖి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి మరోసారి శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టారు.

లేడీ గెటప్ లో ఉన్న అవినాష్ మాట్లాడుతూ శ్రీముఖి శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టడం తెగ వైరల్ అయింది తెలుసా అని చెప్పగా ఆ తర్వాత మా ఇంట్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చిందంటూ శేఖర్ మాస్టర్ కామెంట్లు చేశారు. శేఖర్ మాస్టర్ షాకింగ్ రియాక్షన్ ఇవ్వడంతో పాటు షాకింగ్ కామెంట్స్ చేయగా ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శ్రీముఖి శేఖర్ మాస్టర్ కు ముద్దులు పెట్టడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీముఖి ఫ్యాన్స్ ఆమె గురించి నెగిటివ్ గా కామెంట్లు చేయవద్దని కామెంట్లు పెడుతుండగా కొందరు మాత్రం ఆమెను ఏకిపారేస్తున్నారు. గతంలో వరుస షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి ప్రస్తుతం పరిమితంగా షోలు చేస్తున్నారు. శ్రీముఖి యాంకర్ గా బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటూ ఉండటం గమనార్హం.


‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus