సునీత కోసం యాంకర్ సుమ ఖరీదైన గిఫ్ట్!

టాలీవుడ్ బెస్ట్ సింగర్స్ లో ఒకరైన సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి సునీత పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వస్తుండగా ఫైనల్ గా ఆమె వ్యాపార వేత్త రామ్‌ వీరపనేనిని రాముని సాక్షిగా శంషాబాద్ సమీపంలోని సీతారామ చంద్రస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సునీత గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే.

ఇక ఆమె పెళ్లి చేసుకున్న సందర్భంగా ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అంధించారు. అందులో యాంకర్ సుమ కూడా ఒకరు. ఇండస్ట్రీలో సునీతకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే యాంకర్ ఝాన్సీ ఆ తరువాత యాంకర్ సుమ అనే చెబుతారు. అయితే పెళ్లి వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చిన సుమ సునీతకు స్పెషల్ కానుకను అందించింది. ఆ సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఎమిటంటే.. ఖరీదైన నెక్లెస్‌ను సునీతకు ప్రేమతో బహుకరించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆ స్పెషల్ గిఫ్ట్ కు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం నెక్లెస్ అనే కాకుండా హిందు సాంప్రదాయం ప్రకారం సునీతకు పట్టుచీర, బొట్టు కూడా పెట్టారట. ఇక త్వరలో ఒక స్పెషల్ పార్టీ నిర్వహించి రామ్ సునీత దంపతులు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ఆ వేడుకకు ఆహ్వానించనున్నట్లు సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus