అనర్గళంగా మాట్లాడి అభిమానులను మెప్పించడం కోసం హీరోలు ఎంతో కష్టపడుతుంటారు. ఒకవేళ అలా చెప్పినా అది బట్టి పట్టి చెప్పాల్సిందే. అదే టైమింగ్ వారి రియల్ లైఫ్ లో ఉంటుందో లేదో చెప్పలేము. అవును ఇది నిజమే… సినిమాల్లో కనిపించినంత యాక్టివ్ గా హీరోలు నిజ జీవితంలో ఉండరు. అయితే ఆ వరం మాత్రం ఒక్క యాంకర్ సుమకు మాత్రమే ఆ దేవుడు ఇచ్చాడని చెప్పాలి. యాంకర్ లలో సుమనే నెంబర్ వన్. ఇది ఏ వయసు కలిగిన ప్రేక్షకులు అయినా ఒప్పుకోవాల్సిన నిజం.
ఏ హీరో సినిమా ఈవెన్ట్ లకు అయినా సుమ యాంకరింగ్ ఉంటేనే అందం. బుల్లితెర పై ఈమె సందడి అంతా ఇంతా కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ .. ఈమెను తన ఇంట్లో మనిషిలా భావిస్తూ ఉంటారు. అలాంటి యాంకర్ సుమ… కన్నీళ్ళు పెట్టుకోవడం వైరల్ గా మారింది. ఇంతకీ సుమ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంది. అందుకు కారణం ఎవరు.. అనేగా మీ డౌట్. అసలు విషయం ఏమిటంటే…లాక్డౌన్ కారణంగా దినసరి ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం అందించాలని అక్షయ పాత్ర తరఫున యాంకర్ సుమ విరాళాలు సేకరించడానికి ముందుకు వచ్చింది.
అందుకు గాను ఆమె 5 లక్షల రూపాయల విరాళం టార్గెట్ పెట్టుకుంటే.. ఇప్పటివరకూ రూ.3,91,000 వచ్చిందట. ఈ విషయం పై సోషల్ మీడియాలో స్పందించిన సుమ.. 307 మంది ఈ విరాళాలు ఇచ్చారని తెలిపింది. నేను ఇచ్చిన పిలుపుకి ఇంతమంది స్పందించి విరాళాలు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ థ్యాంక్స్. మానవత్వం ఇంకా బ్రతికే ఉంది’ అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది.
Most Recommended Video
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!