‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!

  • April 27, 2020 / 08:35 PM IST

ఏప్రిల్ 28… ఈ డేట్ కు చాలా స్పెషల్ ఉంది. ఈ డేట్ న రెండు ఇండస్ట్రీ హిట్ లు టాలీవుడ్ కు దక్కాయి. ఒకటి ‘పోకిరి’ రెండు ‘బాహుబలి2’. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయనే చెప్పాలి. మన ‘పోకిరి’ చిత్రంతోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్టు కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఇక ‘బాహుబలి2’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచం మొత్తానికి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. 1000 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి ఇండియన్ సినిమా ‘బాహుబలి2’ నే కావడం విశేషం. అయితే అసలు బాహుబలి వెనుక మనకి తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి.

ముందుగా రాజమౌళి ఈ చిత్రాన్ని హిందీలో తియ్యాలి అని అనుకున్నారట.అలా ఈ ఆలోచన రాజమౌళి మనసులో మొదలైంది. అందుకు గాను ఆయన బాహుబలి పాత్రకి హృతిక్ రోషన్ ను అలాగే భల్లాల దేవుడి పాత్రకి జాన్ అబ్రహం ను అనుకున్నారట. అయితే తరువాత ఎందుకో ఆయన ఈ ఆలోచన మార్చుకున్నారు. అయితే ప్రభాస్ వాళ్ళ నాన్నగారు దివంగత సూర్య నారాయణ రాజు గారు.. తన కొడుకు ప్రభాస్ ను ఓ కింగ్ రోల్ లో అదీ వారియర్ గా చూడాలి అనే కోరిక ఉన్నట్టు ‘ఛత్రపతి’ టైం నుండీ రాజమౌళి కి అలాగే కీరవాణికి చెబుతూ ఉండేవారట.

కీరవాణి గారిని కెరీర్ ప్రారంభంలో ఎంకరేజ్ చేసింది ప్రభాస్ తండ్రి గారే. దాంతో బాహుబలి అనే ఆలోచన వచ్చినప్పుడే హిందీలో తియ్యాలి అనుకున్న రాజమౌళికి తరువాత తెలుగులో తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందట. మొదట బాహుబలి ని నిర్మించడానికి ఓ బడా సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఎందుకో తప్పుకుంది. దాంతో ‘ఆర్కా మీడియా’ వాళ్ళు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. బాహుబలి మొదటి చాయిస్ ఎవరు … అసలు బాహుబలి ఆఫర్ ను ఎందుకు రిజెక్ట్ చేసారు ఓ లుక్కేద్దాం రండి.

1) బాహుబలి : ప్రభాస్ పాత్రకి ముందుగా అనుకున్నది హృతిక్ రోషన్.

2) భల్లాల దేవుడు : ఈ పాత్రకి రానా కంటే ముందు జాన్ అబ్రహం ను అనుకున్నాడు రాజమౌళి.

3) శివగామి : ఇక శ్రీదేవి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసాక … శివగామి పాత్రకి మంచు లక్ష్మీ ని కూడా రాజమౌళి సంప్రదించారు. అయితే ‘ప్రభాస్ కు తల్లి పాత్రా… నేను చెయ్యను’ అని ఆమె కూడా రిజెక్ట్ చేసింది.

4)అవంతిక : ఎప్పుడైతే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకున్నారో… ఈ చిత్రంలో అవంతిక పాత్రకి ముందుగా బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ను అనుకున్నారట. కానీ రెండేళ్ళు షూటింగా ? అని భయపడి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

5) కట్టప్ప : సినిమాకి ఈ పాత్ర వెన్నెముక్క లాంటిది. ‘బాహుబలి’ అనే పేరు వినగానే మనకి కట్టప్ప పాత్ర కూడా గుర్తుకొస్తుంది. అయితే రాజమౌళి మొదటిగా ఈ పాత్ర కోసం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ను అనుకున్నారట. కానీ ఆయన రిజెక్ట్ చెయ్యడంతో సత్య రాజ్ గారిని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus