Udaya Bhanu: అది ఇళ్ళా… ఇంద్రభవనమా చూడటానికి రెండు కళ్ళు చాలా లేదుగా!

యాంకర్ ఉదయభాను పరిచయం అవసరం లేని పేరు కెరియర్ మొదట్లో వెండితెరపై పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం బుల్లితెరపై తన మాట తీరుతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బుల్లితెర శ్రీదేవి గా పేరు సంపాదించుకున్న ఉదయభాను చాలా కాలం పాటు ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె కవలలకు జన్మనివ్వడంతో అప్పటినుంచి ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యారు.ఇప్పుడిప్పుడే పిల్లలు పెద్దవడంతో ఈమె కూడా పలు అడపాదడపా కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

ఎంతో అందం అభినయం చక్కని మాట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఉదయభాను తాజాగా కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేసినట్టు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం ఇంకా ఇంటి పనులు జరుగుతుండగానే ఈమె చాలా సింపుల్ గా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. తన భర్త పిల్లలతో కలిసి గృహప్రవేశం చేసిన ఉదయభాను అనంతరం ఇంట్లో పాలు పొంగించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

అయితే ఇందులో భాగంగానే (Udaya Bhanu) తన హోమ్ టూర్ వీడియోని కూడా అందరితో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా కాస్త పనులు మిగిలిపోయాయని ఉదయభాను తెలియజేశారు. అయితే మొత్తం పాలరాతితో కట్టిన ఇంద్రభవనంలా ఈ ఇల్లు ఉందని చెప్పాలి. అసలు ఉదయభాను ఇంటిని చూడటానికి రెండు కళ్ళు ఏమాత్రం సరిపోలేదు. మరి కొద్ది రోజులలో ఇంటి పని పూర్తి అవుతుందని అప్పుడు పూర్తి వీడియో షేర్ చేస్తానని చెప్పుకొచ్చారు.

అయితే ఈ వీడియోలో గెస్ట్ రూమ్ నుంచి మొదలుకొని పిల్లల రూమ్, వారి స్టడీ రూమ్, హోమ్ థియేటర్ బాల్కనీ ,టెర్రస్ మొత్తం అన్ని చూపించారు. అయితే ఈ ఇల్లు మాత్రం అచ్చం ఇంద్రభవనాన్ని తలపిస్తుందని చెప్పాలి. ఇల్లు మొత్తం చాలా రిచ్ లుక్ లో ఉంది. ప్రస్తుతం ఉదయభాను షేర్ చేసిన ఈ హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus