నార్త్ లో సౌత్ సినిమాల డామినేషన్ ఇప్పుడు ఎక్కువగానే ఉంది. అక్కడ ఫిలిం మేకర్స్ మాస్ హిట్లు కొట్టలేక.. ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) వంటి దర్శకులు కూడా ‘డంకి’ (Dunki) వంటి నాసి రకం సినిమాలు తీసి ప్లాపులు మూటగట్టుకుని రోజులు వచ్చాయి. ఆ సినిమా వరకు రాజ్ కుమార్ హిరానీ… అపజయమెరుగని దర్శకుడిగా ఓ వెలుగు వెలిగాడు. ఇప్పుడు అతనితో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు భయపడిపోతున్నారు.
అలాంటి రోజులు వచ్చేశాయి. ఇక ఇదే మంచి టైం అని భావించి కొంతమంది టాలీవుడ్ దర్శకులు నార్త్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ మార్కెట్ చాలా పెద్దది. ఒక్క హిట్టు కొట్టినా భారీ లాభాలు వస్తాయి. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)కూడా బాలీవుడ్ మార్కెట్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. అపజయమెరుగని దర్శకుడిగా పేరొందిన అనిల్ రావిపూడి.. కామెడీ టచ్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీయడంలో సిద్ధహస్తుడు.
బాలీవుడ్లో అలాంటి సినిమా తీస్తే బాక్సాఫీస్ కొల్లగొట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్లో సినిమా అంటూ చేస్తే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని (Sankranthiki Vasthunam) సల్మాన్ ఖాన్ తో (Salman Khan) రీమేక్ చేయాలని ఉంది. అతనికైతే ఆ సబ్జెక్టు బాగుంటుంది అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. మరి సల్మాన్ ఖాన్.. ఇలా ఆలోచిస్తాడేమో చూడాలి. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.