Animal Collections: ‘యానిమల్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

  • December 6, 2023 / 03:45 PM IST

రణబీర్ కపూర్,’అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 10.60 cr
సీడెడ్ 1.82 cr
ఉత్తరాంధ్ర 2.49 cr
ఈస్ట్ 1.16 cr
వెస్ట్ 1.05 cr
గుంటూరు 1.09 cr
కృష్ణా 1.28 cr
నెల్లూరు 0.71 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 20.02 cr

‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.20.02 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్ కి ఇప్పటివరకు రూ.8.82 కోట్ల లాభాలను అందించింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus