Anirudh Ravichander: ఎన్టీఆర్- కొరటాల మూవీకి అనిరుధ్ వర్క్ షురూ..!

  • August 28, 2021 / 04:51 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ను ఈ మధ్యనే ఫినిష్ చేసాడు ఎన్టీఆర్.2018 నవంబర్ నుండీ ఇప్పటి వరకు అతను ‘ఆర్.ఆర్.ఆర్’ కే అంకితమైపోయాడు. ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత అతను బయటపడినట్టు అయ్యింది.మరోపక్క అతను ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోతో కూడా బిజీగా గడుపుతున్నాడు.’ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అయ్యే లోపు బుల్లితెర పై అయినా ఎన్టీఆర్ ను చూసే అవకాశం రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఎంపికైనట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం అతనికి ఏకంగా రూ.4 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు కూడా వార్తలు వినిపించాయి.నిజానికి ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ మూవీకే అనిరుధ్ వర్క్ చేయాల్సి ఉంది. ఆ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా అనిరుధ్ హాజరయ్యాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ అవకాశం తమన్ కు వెళ్ళింది.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్- కొరటాల మూవీకి అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతుంది కానీ నిర్మాతలైన ‘యువసుదా ఆర్ట్స్’ వారు కన్ఫర్మ్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇతను ఓ పాటని కంపోజ్ చేయడానికి రెడీ అయిపోయినట్టు టాక్ నడుస్తుంది. మరో రెండు రోజుల్లో ఇతను దర్శకుడు కొరటాలతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్ లు వేయబోతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus