Anjali Marriage: పెళ్లి వార్తలపై అంజలి ఏమన్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అంజలికి సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుండగా చరణ్ శంకర్ కాంబో మూవీలో చరణ్ కు జోడీగా అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగమ్మాయిగా పాపులారిటీని సొంతం చేసుకున్న అంజలి కొన్ని వివాదాస్పద సంఘటనల్లో చిక్కుకోవడం వల్ల ఆమె గురించి సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ కామెంట్లు ప్రచారంలోకి వచ్చాయి. అంజలి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లి వార్తల గురించి స్పందించిన అంజలి ఆ ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చారు.

తనకు ఇప్పటికే పెళ్లైపోయిందని తాను అమెరికాలో నివాసం ఉంటున్నానని ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయని ఆమె తెలిపారు. అయితే ఈ వార్తలకు సంబంధించి జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అంజలి కామెంట్లు చేశారు. ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏ మాత్రం లేదని అంజలి వెల్లడించడం గమనార్హం. అయితే పెళ్లి విషయంలో తనకు నెగిటివ్ ఒపీనియన్ లేదని సరైన సమయం వస్తే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమేనని ఆమె కామెంట్లు చేశారు.

అంజలితో పాటు సినిమాల్లోకి వచ్చిన చాలామంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకోగా అంజలి కూడా త్వరలో పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ను అభిమానులకు చెబుతారేమో చూడాల్సి ఉంది. అంజలి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. అంజలి ఫాల్ అనే పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో నటించగా తాజాగా ఈ వెబ్ సిరీస్ విడ్దుదలైంది.

మంచి కథలకు, ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే అంజలి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో అంజలి రేంజ్ మారిపోతుందేమో చూడాలి. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా చరణ్ కు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus